ఐబీ అధికారి హత్య : తాహిర్‌కు షాక్‌

15 Mar, 2020 12:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో ఐబీ అధికారి అంకిత్‌ శర్మ హత్య కేసులో ప్రధాన నిందితుడు, ఆప్‌ బహిష్కృత నేత తాహిర్‌ హుస్సేన్‌ పాత్రకు సంబంధించి ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమైనట్టు తెలిసింది. అంకిత్‌ శర్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తాహిర్‌ హుస్సేన్‌పై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే హత్య కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 24-25 తేదీల్లో తూర్పు ఢిల్లీలో జరిగిన అల్లర్లలో శర్మను అల్లరిమూకలు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. హత్య జరిగిన చాంద్‌ బాగ్‌ ప్రాంతంలోనే తాహిర్‌ కార్యాలయం ఉందని, అక్కడ పెద్దసంఖ్యలో అల్లరి మూకలు గుమిగూడారని..పెద్దసంఖ్యలో రాళ్లు, పెట్రోల్‌ బాంబులున్నాయని బాధితుడి తండ్రి రవీందర్‌ కుమార్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. చాంద్‌ బాగ్‌ ప్రాంతంలో తాహిర్‌ ఇంటి సమీపంలోని డ్రైనేజ్‌లో అంకిత్‌ శర్మ మృతదేహం లభ్యమైంది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఢిల్లీ అల్లర్లలో 53 మంది మరణించారు.

చదవండి : అంకిత్‌ శర్మ మృతదేహంపై 51 గాయాలు

మరిన్ని వార్తలు