ఢిల్లీ కాలుష్యానికి ఇవే కారణాలు

9 Nov, 2017 10:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం అత్యంత విషతుల్యంగా మారుతోంది. ప్రధానంగా శీతాకాలంలో ఇది మరింత ప్రమాదకరంగా ఉంటోంది. ప్రస్తుతం ఢిల్లీలో బుధవారంతో పోలిస్తే.. గురువారం మరింత ప్రమాదకరంగా ఉంది. ఢిల్లీలో గాలి కలుషితవం కావడం వెనుక.. సమీప రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్‌లలో రైతులు తమ పంటను తగులబెట్టడం కూడా కారణంగా మారింది. దీంతో పాటు పలు కారణాల వల్ల ఢిల్లీ వాతావరణం, గాలి అత్యంత కాలుష్యంగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఢిల్లీ కాలుష్యానికి కారణాలు

  • రహదారులపై పేరుకుపోయిన చెత్త, దుమ్ము, ధూలి, నిర్మాణాల కారణంగా మొత్తం 38 శాతం కాలుష్యం జరుగుతోంది.
  • వాహనాల వల్ల 20శాతం కాలుష్యం
  • గృహవినియోగారుల నుంచి బయటకు వచ్చే చెత్త వల్ల 12 శాతం
  • భారీ నిర్మాణాలు, వాటి మెటీరియల్‌ నుంచి 6 శాతం కాలుష్యం
  • రెస్టారెంట్లు, హోటళ్ల వల్ల.. 3 శాతం
  • ప్లాస్టిక్‌ వంటి చెత్తను కాల్చడం వల్ల 3 శాతం
  • పరిశ్రమల వల్ల 2 శాతం
  • ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాల వల్ల 2 శాతం
  • గీజర్లు, ఎలక్ట్రిసిటీ జనరేటర్ల వల్ల 2 శాతం
  • శవదహనాల వల్ల 1 శాతం
     
మరిన్ని వార్తలు