దీపావళి రాకముందే...

26 Oct, 2019 04:10 IST|Sakshi

న్యూఢిల్లీ: దీపావళి పండుగకు రెండు రోజుల ముందే దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అధ్వానంగా మారింది. ప్రస్తుత సీజన్‌కు సంబంధించి శుక్రవారం నాడు అత్యల్ప గాలి నాణ్యత నమోదైంది. గురువారం సాయంత్రం నగరంలో గాలి నాణ్యత సూచిక(ఏక్యూఐ) 311గా ఉండగా.. శుక్రవారం 284 నుంచి 315 మధ్య నమోదైంది. గాలి కదలికలో వేగం మందగించడంతో కాలుష్యం తీవ్రత పెరిగింది. 

ముఖ్యంగా నెహ్రూ నగర్, అశోక్‌ విహార్, జహంగీర్‌పురి, రోహిణి, వాజీర్‌పూర్, బావన, ముండ్కా, ఆనంద్‌ విహార్‌ ప్రాంతాల్లోనూ ఇదే తీరుందని  కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. చుట్టు్టపక్కలున్న బాఘ్‌పట్, ఘజియాబాద్, గ్రేటర్‌ నోయిడా, గుర్‌గావ్, నోయిడాల్లోనూ ఇలాగే ఉంది. మరోవైపు ఢిల్లీ, శాటిలైట్‌ టౌన్‌లలో శనివారం నుంచి బుధవారం వరకు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా సుప్రీంకోర్టు నిషేధం విధించింది. బొగ్గు ఆధారిత పరిశ్రమలు, పవర్‌ ప్లాంట్లు మూసివేయాలని ఆదేశించింది.

మరిన్ని వార్తలు