ఢిల్లీలో ఆవిష్కృతం కానున్న అద్భుతం!

3 Nov, 2018 12:26 IST|Sakshi
ఢిల్లీ ఐకానిక్‌ బ్రిడ్జి ఏరియల్‌ వ్యూ

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర, ఈశాన్య ఢిల్లీల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు 14 ఏళ్ల కిత్రం చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. యమునా నదిపై నిర్మితమైన ఈ ఐకానిక్‌ బ్రిడ్జిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం ప్రారంభించనున్నారు. నవంబరు 5 నుంచి ఈ బ్రిడ్జి ప్రజా వినియోగంలోకి రానుంది. 575 మీటర్ల పొడవు, 35.2 మీటర్ల వెడల్పు కలిగి ఉన్న ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల వజీరాబాద్‌ బ్రిడ్జిపై ట్రాఫిక్‌ తగ్గడంతో పాటు ప్రయాణం మరింత సులభతరంగా మారనుంది. కాగా 2004 నుంచి వివిధ కారణాల వల్ల పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ బ్రిడ్జి నిర్మాణానికి సుమారు 1575 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి.

సిటీ అందాలు వీక్షించేందుకు వీలుగా
భారత్‌లో మొట్టమొదటి అసిమ్మెట్రికల్‌ కేబుల్‌ స్టేయిడ్‌ బ్రిడ్జిగా ఢిల్లీ బ్రిడ్జి గుర్తింపు పొందింది. ఈ బ్రిడ్జిపై నిర్మించిన 150 మీటర్ల ఎత్తైన గ్లాస్‌ బాక్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సెల్ఫీ స్పాట్‌గా అభివృద్ధి చేస్తున్న ఈ గ్లాస్‌ బాక్స్‌లో నాలుగు ఎలివేటర్లు ఏర్పాటు చేశారు. ఒకేసారి 50 మందిని మోసుకు వెళ్ల గల గ్లాస్‌ బాక్స్‌ గుండా యమునా నది అందాలతో పాటు, సిటీ మొత్తాన్ని వీక్షించవచ్చు. అయితే ఈ సెల్ఫీ స్పాట్‌ ఫిబ్రవరి నుంచి వినియోగంలోకి రానుంది.

మరిన్ని వార్తలు