రవాణా శాఖ మంత్రి రాజీనామా

14 Jun, 2016 21:02 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆరోగ్య కారణాల దృష్ట్యా ఢిల్లీ రవాణా శాఖ మంత్రి గోపాల్ రాయ్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజుల కిందట అనారోగ్యంతో సర్జరీ చేయించుకున్న రాయ్ ప్రస్తుతం ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు. గత శుక్రవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసి బాధ్యతల  నుంచి తప్పించాలని కోరిన ఆయన రాజీనామాను సమర్పించారు.

రాయ్ స్థానంలో ఢిల్లీ పబ్లిక్ వెల్త్ అండ్ డెవలప్ మెంట్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ను బాధ్యతలు తీసుకున్నారు. కాగా, యాప్ బేస్డ్ ప్రీమియం బస్ సర్వీసెస్ లో అవినీతి ఆరోపణలు వచ్చిన కొద్ది రోజుల్లోనే రాయ్ రాజీనామా చేశారు. దీనిపై బీజేపీ నేత విజేందర్ గుప్తా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కి ఫిర్యాదు చేశారు. ప్రీమియం బస్ సర్వీసెస్ లో నియమాల ఉల్లంఘనతో పాటు అవినీతి జరిగిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. బస్ సర్వీసుల్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే తాను జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమేనని రాయ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు