సిలబస్‌ నుంచి ఐలయ్య పుస్తకం తొలగింపు?

25 Oct, 2018 12:10 IST|Sakshi

సిఫార్సుచేసిన డీయూ స్టాండింగ్‌ కమిటీ

సాక్షి, న్యూఢిల్లీ: పొలిటికల్‌ సైన్స్‌ సిలబస్‌ నుంచి ప్రొ.కంచ ఐలయ్య రాసిన పుస్తకాలను తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ సిఫార్సుచేసింది. విద్యాపర విషయాల్లో దళిత్‌ అనే పదం స్థానంలో ‘షెడ్యూల్డ్‌ కులం’ను వాడాలని పేర్కొంది. విద్యా విషయాలపై వర్సిటీ స్టాండింగ్‌ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా 9 పీజీ కోర్సుల సిలబస్‌పై చర్చించామని ప్రొ.హన్స్‌రాజ్‌ సుమన్‌ తెలిపారు. ప్రొ.కంచ ఐలయ్య రాసిన ‘వై ఐ యామ్‌ నాట్‌ ఎ హిందు’, ‘పోస్ట్‌-హిందూ ఇండియా’లో వివాదస్పద విషయాలు ఉన్నందునే వాటిని సిలబస్‌ నుంచి తప్పించాలని వర్సిటీకి సూచించినట్లు చెప్పారు. అంబేడ్కర్‌ రచనల్ని సిలబస్‌లో చేర్చాలని సిఫార్సు చేశారు. స్టాండింగ్‌ కమిటీ సిఫార్సు దురదృష్టకరమని ఐలయ్య వ్యాఖ్యానించారు. తన పుస్తకాలు పలు విదేశీ, దేశీ యూనివర్సిటీల సిలబస్‌లలో భాగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

>
మరిన్ని వార్తలు