నీటి బిల్లు మోత

27 Dec, 2017 08:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఢిల్లీలోని ఆప్‌ సర్కార్‌ నీటి బిల్లులనూ మోతెక్కించింది. వాటర్‌ టారిఫ్‌ను 20 శాతం పెంచాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. కేజ్రీవాల్‌ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్ధాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

20,000 లీటర్ల పైన ఒక్క లీటర్‌ అధికంగా వాడుకున్నా మొత్తం వాడిన నీటిపై బిల్లు భారం పడనుంది. ఫిబ్రవరి 1 నుంచి పెరిగిన నీటి చార్జీలు అమల్లోకి రానున్నాయి. భారీ నష్టాల్లో కూరుకుపోయిన ఢిల్లీ జల్‌ బోర్డ్‌ నీటి చార్జీలను పెంచాలని ప్రతిపాదించింది. గత ఏడాది రూ.209 కోట్ల నష్టాలు మూటగట్టుకున్న జల్‌ బోర్డ్‌ ప్రస్తుత నష్టాలు రూ.516 కోట్లకు పెరిగాయి.
 

మరిన్ని వార్తలు