ఢిల్లీలో మరో ప్లాస్మా సెంటర్‌ ప్రారంభం!

14 Jul, 2020 13:07 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్‌-19 రోగుల కోసం  రెండో ప్లాస్మా సెంటర్‌ను ప్రారంభించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న లోక్‌నాయక్‌ హాప్పటల్‌లో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడుతూ, మేం పెట్టిన మొదటి ప్లాస్మా సెంటర్‌ విజయవంతమైంది. అందుకే రెండో సెంటర్‌ను ఎల్‌ఎన్‌జీపీ వద్ద ఈరోజు ప్రారంభించాం అని ట్వీట్‌ చేశారు. 

చదవండి: బిడ్డ‌కు క‌రోనా, త‌ల్లికి మాత్రం నెగెటివ్‌

ఈ ఆసుపత్రిలో ముగ్గురు ప్లాస్మా స్వీకరణ కోసం ముగ్గురు కౌన్సిలర్లను నియమించారు. వీరు కోవిడ్‌ వైరస్‌ నుంచి కోలుకున్న వారికి ప్లాస్మా థెరపీ గురించి వివరించి, వారిని ప్లాస్మా దానం చేయడానికి ఒప్పిస్తారు. మొదటిసారి ప్రారంభించిన ప్లాస్మాసెంటర్‌ విజయవంతం కావడంతో రెండో సెంటర్‌ను మంగళవారం ప్రారంభించారు. ఢిల్లీలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య 80శాతంగా ఉంది. ఇప్పటి వరకు ఢిల్లీలో 113,740 కరోనా కేసులు నమోదయ్యాయి.  

చదవండి: కరోనా కట్టడికి 5 ఆయుధాలు: సీఎం

మరిన్ని వార్తలు