నోట్ల రద్దుతో భారీగా దెబ్బతిని తిరుగుముఖం..

29 Nov, 2016 09:05 IST|Sakshi
నోట్ల రద్దుతో భారీగా దెబ్బతిని తిరుగుముఖం..
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రభావం సామాన్య జనం మీదే కాదు.. ఆ జనం కోసం పోరాడుతున్నామని చెప్పే మావోయిస్టులపై కూడా పడుతోంది. కేంద్రం అనూహ్యంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంతో వాటిని ఉపయోగించే తమ అవసరాలను తీర్చుకునే మావోయిస్టులకు ఇప్పుడు అవసరాల విషయంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ చివరకు వాస్తవిక పరిస్థితుల్లోకి వచ్చి  లొంగిపోతున్నారని పోలీసులు చెప్పారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక్క నోట్ల రద్దు అనంతరం 28 రోజుల్లో 564మంది మావోయిస్టులు వారి సానుభూతి పరులు పోలీసుల ముందు లొంగిపోయారు.

ఇతది గతంతో పోలిస్తే చాలా ఎక్కువ అని పోలీసులు చెబుతున్నారు. ఓ పక్క సీఆర్‌పీఎఫ్‌, స్థానిక పోలీసులు గాలింపులు జరుపుతున్న దొరకని మావోయిస్టులు ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు కారణంగా ప్రభావానికి గురై స్వయంగా లొంగిపోతున్నారని తెలిసింది. ఛత్తీస్‌ గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం ఉన్న విషయం తెలిసిందే. ఇందులో ఒక్క ఒడిశాలోని మల్కన్‌ గిరి జిల్లా నుంచే 70శాతం మంది మావోయిస్టులు లొంగిపోయారంట. గత నెలలో ఇక్కడే ఆంధ్రప్రదేశ్ గ్రే హౌండ్స్ బలగాలు 23 మంది మావోయిస్టులను ఎన్‌ కౌంటర్‌లో చంపేశారు. గత రికార్డులతో పోలీస్తే పెద్ద మొత్తంలోనే మావోయిస్టులు లొంగిపోతున్నారని తెలిసింది.

2011 నుంచి ఈ నెల 15 వరకు ఉన్న గణాంకాల ప్రకారం 3,766మంది లొంగిపోగా వారిలో ఈ ఒక్క ఏడాదిలోనే 1,399మంది ఉన్నారు. అది కాకుండా ఈ ఒక్క నెల(నవంబర్‌)లోనే 564మంది లొంగిపోయినట్లు కేంద్ర హోంశాఖ వద్ద వివరాలు ఉన్నా‍యి. గత ఆరేళ్లలో ఇదే ఎక్కువని కూడా హోంశాఖ చెబుతోంది. పాత కరెన్సీ ఉపయోగించి తమ అవసరాలు తీర్చుకోవడం అంత సులువు కాదని, ఆయుధ సామాగ్రి, మందులు, నిత్యావసరాలు, ఇతరుల నుంచి ఆయుధాల కొనుగోళ్లవంటివి జరగబోవని, ముఖ్యంగా నిత్యవసరాలు కూడా తీరని పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారు చేసేది లేక లొంగిపోతున్నారని ఓ సీఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారి తెలిపారు.
మరిన్ని వార్తలు