వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: మేఘవాల్

15 Nov, 2016 10:51 IST|Sakshi

న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ స్పష్టం చేశారు. ఈ అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. నోట్ల రద్దు నిర్ణయం నల్ల కుబేరులకు లాభం కలిగించేలా ఉందన్న విపక్షాల ఆరోపణలపై మేఘవాల్ స్పందిస్తూ..  అవినీతికి పాల్పడే బ్యూరోక్రాట్లను కేంద్ర ప్రభుత్వం ఎందుకు కాపాడుతుందని ప్రశ్నించారు. దీర్ఘకాలంలో మంచి ఫలితాలు కనిపిస్తాయని ఆయన అన్నారు.

కాగా నోట్ల రద్దుతో సామాన్యుడికి కష్టాలు కొనసాగుతున్నాయి. సోమవారం బ్యాంకులకు సెలవు కావడంతో నోట్ల మార్పిడితో పాటు నగదు డ్రా చేసుకునేందుకు జనాలు తెల్లవారుజాము నుంచే బ్యాంకుల వద్ద బారులు తీరారు. దేశ రాజధాని ఢిల్లీలో అయితే రా్తరి నుంచి ఏటీఎంల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గత మంగళవారం రూ.500,1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు