5న మహా సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌..

1 Nov, 2019 16:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అధికార పంపంకంపై బీజేపీ-శివసేనల మధ్య ప్రతిష్టంభన ఓవైపు కొనసాగుతుండగానే మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ ఈనెల 5న పదవీ స్వీకార ప్రమాణం చేస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో బీజేపీ సొంతగానే ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేపట్టిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫడ్నవీస్‌ మహారాష్ట్ర నూతన సీఎంగా ఈ నెల 5 లేదా 6న ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నారు. కూటమి నుంచి శివసేన తప్పుకున్నా తాము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేసే బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేలు ప్రసాద్‌ లద్‌, చంద్రకాంత్‌ పాటిల్‌లకు అప్పగించారు. మరోవైపు తాము ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాకు కట్టుబడి ఉన్నామని, సీఎం పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలనే డిమాండ్‌ను శివసేన నేత సంజయ్‌ రౌత్‌ పునరుద్ఘాటించారు. ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములా అంటే ఏంటి..? సీఎం పదవి దీని పరిధిలోకి రాదా అని ఆయన ప్రశ్నించారు. శివసేన కోరుకుంటే రాష్ట్రంలో సుస్ధిర ప్రభుత్వం అందించేందుకు అవసరమైన సంఖ్యా బలం తాము సాధిస్తామని సంజయ్‌ రౌత్‌ చెప్పుకొచ్చారు. ఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్ధానాల్లో గెలుపొంది ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 56 స్ధానాల్లో గెలుపొందగా, విపక్ష కాంగ్రెస్‌, ఎన్సీపీలు వరుసగా 44, 54 స్ధానాలు దక్కించుకున్నాయి. 288 స్ధానాలు కలిగిన మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 146 స్ధానాలతో కూడిన మేజిక్‌ ఫిగర్‌ ఏ పార్టీకి సొంతంగా లభించలేదు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చిదంబరం ఆరోగ్యం ఓకే..కానీ !

రాజధానిలో హెల్త్‌ ఎమర్జెన్సీ

నిర్భయ దోషులకు వారంలో ఉరిశిక్ష!

‘మా అమ్మకు అందమైన వరుడు కావాలి’

ఏడేళ్లలో 48కోట్ల మంది చనిపోతారా?

ముఖ్యమంత్రిగా ఛాన్స్‌ ఇవ్వాలని రైతు లేఖ..

వాట్సప్‌ డేటా చోరీపై ప్రియాంక ఫైర్‌

బీజేపీ నాయకుడి వాహనాలకు నిప్పు

‘పాత ఙ్ఞాపకాలు.. కానీ కొంచెం కొత్తగా’

భారత పర్యటనలో జర్మనీ ఛాన్సలర్‌

వైరల్‌: నువ్వు మామూలు తల్లివి కాదమ్మా!..

3జీ సేవలను నిలిపేస్తున్న ఎయిర్‌టెల్‌!

డోర్ మూయకుంటే డ్రైవర్, కండక్టర్‌పై చర్యలు

ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగు కలకలం

కశ్మీర్‌కు ముర్ము.. లదాఖ్‌కు మాథుర్‌

వాట్సాప్‌ డేటాపై ‘పెగాసస్‌’ గురి

ఆర్టికల్‌ 370 రద్దు పటేల్‌కు అంకితం

సీఎం పీఠమూ 50:50నే!

కార్మిక గళం మూగబోయింది

‘అండర్‌ వరల్డ్‌తో వ్యాపార సంబంధాలు లేవు’

ఇద్దరు మాత్రమే వచ్చారు!

గుడ్లు తినేవారు రాక్షసులు: బీజేపీ నేత

ఈనాటి ముఖ్యాంశాలు

ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకి: ప్రియాంక

నిర్మలా సీతారామన్‌కు రాజన్‌ కౌంటర్‌

వాట్సాప్‌ హ్యాకింగ్‌.. వెలుగులోకి సంచలన అంశాలు!

దేశంలో కొత్తగా వంద విమానాశ్రయాలు

కశ్మీర్‌ భూములపై ఎవరికి హక్కు?

చిదంబరం ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశం

వీడని ఉ‍త్కంఠ.. శివసేన కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

శ్రీముఖి కోసం ‘సైరా’ను వాడుకున్నారు..

నేనే దర్శకుడినైతే అనసూయను..

ఆ షో కంటెస్టెంట్‌ ఎవరో తెలుసా?

బ్యాట్‌తో గ్రౌండ్‌లోకి దిగిన షాహిద్‌!

బిగ్‌బాస్‌: హేమ తిరిగొచ్చింది.. శ్రీముఖికి పంచ్‌

నిర్భయ దోషులకు వారంలో ఉరిశిక్ష!