తప్పైతే క్షమించండి : సీఎం భార్య

22 Oct, 2018 19:49 IST|Sakshi
అమృత ఫడ్నవీస్‌

ముంబై : సెల్ఫీ కోసం రూల్స్‌ బ్రేక్‌ చేసిన మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవీస్‌ సతీమణి అమృత ఫడ్నవీస్‌ ఎట్టకేలకు క్షమాపణలు కోరారు.  భారత్‌ తొలి దేశియ క్రూయిజ్ ఆంగ్రియా ప్రారంభం సందర్భంగా ఆమె భద్రతా వలయాన్ని దాటి సెల్ఫీ తీసుకున్నారు. దీనిపై సర్వతా విమర్శలు రావడంతో క్షమాపణలు కోరారు. ‘ ఎవరైనా నేను చేసింది తప్పుని భావిస్తే  దానికి నేను క్షమాపణలు చెబుతున్నా. నేను యువతకు చెప్పేది ఒకటే.. సెల్ఫీ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.’  అని ఓ మరాఠీ ఛానల్‌కు తెలిపారు. అయితే తాను సెల్ఫీ దిగిన ప్రాంతం అంతప్రమాదకరమైనదేం కాదని తన చర్యను సమర్ధించుకున్నారు.

గత శనివారం భారత్‌ తొలి దేశియ క్రూయిజ్‌ ఆంగ్రియాలో ప్రయాణించిన ఆమె పర్‌ఫెక్ట్‌ సెల్ఫీ కోసం రక్షణ గోడ దాటారు. భద్రతా సిబ్బంది ఎంత వారించిన ఆమె పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేయడంతో ఈ ఘటనపై సర్వత్రా విమర్శలొచ్చాయి.  క్రూయిజ్ టూరిజాన్ని వృద్ధి చేయడంలో భాగంగా ఈ షిప్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు ప్రారంభించిన విషయం తెలిసిందే.

చదవండి: సెల్ఫీ కోసం సీఎం భార్య రూల్స్‌ బ్రేక్‌

మరిన్ని వార్తలు