బీభత్సం సృష్టించిన నిసర్గ తుపాను

4 Jun, 2020 08:43 IST|Sakshi

ముంబై: కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్న ముంబైని నిసర్గ తుపాను మరింత భయపెట్టింది. ఆలీబాగ్‌ వద్ద బుధవారం మధ్యాహ్నం తీరాన్ని తాకింది. ఆ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. దాంతో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగి పడ్డాయి. ముఖ్యంగా రాయ్‌గడ్‌ జిల్లాలో బలమైన గాలులు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఓ చోట గాలుల తాకిడికి ఇంటి పై కప్పు ఎగిరి.. మరో ఇంటి మీద పడింది. చెట్లు విరిగి కార్ల మీద పడ్డాయి. ఎన్‌డీఆర్ఎఫ్‌ డీజీ సత్య నారాయణ్ ప్రధాన్ ఇందుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు.
 

ప్రధాన్‌ రాయ్‌గఢ్‌ జిల్లాలోని పెన్ ప్రాంతానికి చెందినవారు. మరో వీడియో మంగోన్‌లోని ధాన్యం గోడౌన్ వద్ద జరిగిన నష్టాన్ని చూపిస్తుంది. హింసాత్మక గాలులు ఈ ప్రాంతాన్ని తాకడంతో ధాన్యం గోడౌన్ పైకప్పు పూర్తిగా ఎగిరి కిందపడింది.
 

పశ్చిమ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్‌లను నాశనం చేసిన నింపన్ తుపానుతో పోల్చుకుంటే నిసర్గ తుపాను వల్ల జరిగిన నష్టం తక్కువనే అంటున్నారు అధికారులు.

మరిన్ని వార్తలు