ఆరు రోజులుగా ఒక్కరు మరణించలేదు..

8 Jun, 2020 15:39 IST|Sakshi

మే 31 నుంచి జూన్‌ 6 వరకు కేవలం 148 కేసులు

ముంబై: ఆసియాలోని అతిపెద్ద మురికివాడ ధారావిలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందంటున్నారు అధికారులు. గత ఆరు రోజులలో ఇక్కడ ఒక్క మరణం కూడా నమోదు కాలేదని బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎమ్‌సీ) అధికారులు ఆదివారం వెల్లడించారు. మురికివాడలో ఇప్పటివరకు 71 మరణాలు నమోదయ్యాయని.. ఇక్కడ మరణాల రేటు 2.67 శాతంగా ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా ముంబైలో కరోనా మరణాల రేటు 3.27 శాతంగా ఉంది. ఇదేకాక రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయిందన్నారు. జూన్ 1న 34  కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం కొత్త కేసుల సంఖ్య 10కి పడిపోయిందని బీఎమ్‌సీ జీ నార్త్ వార్డ్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ కిరణ్ దిఘవ్కర్ తెలిపారు.

ధారావిలోని ఇరుకైన దారులు, సానిటరీ పరిస్థితులు, సామూహిక మరుగుదొడ్లు ఇతర అనేక పరిస్థితుల ఆధారంగా ఈ ప్రాంతాన్ని వర్గీకరిస్తారు. కరోనా వ్యాప్తికి ఈ ప్రాంతం ఆట స్థలంగా మారింది. ధారావిలో మొదటి కేసు ఏప్రిల్ 1న నమోదయ్యింది. మొదట్లో వైరస్‌ వ్యాప్తి నెమ్మదిగా ఉండటంతో కేసుల సంఖ్య 100కు చేరడానికి రెండు వారాలు పట్టింది. అయితే మే 3 నాటికి ఆ సంఖ్య 500కి పెరిగింది. తరువాతి పది రోజుల్లో కేసుల సంఖ్య ఏకంగా 1,000 మార్కును దాటి మే 23 నాటికి 1,500 కు చేరుకుంది. అయితే గత రెండు వారాలుగా అధికారులు కరోనా వ్యాప్తిపై నియంత్రణ సాధించినట్లు తెలిపారు. కరోనా కట్టడిలో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. (కరోనా కట్టడిలో యూపీ భేష్‌.. పాక్‌ మీడియా)

మే 28 -30 వరకు కేవలం 18 కొత్త కేసులు నమోదయ్యాయన్నారు బీఎమ్‌సీ అధి​​కారులు. జూన్ 1న కేసుల సంఖ్య రెట్టింపయినట్లు గుర్తించామన్నారు. మే మధ్యలో బీఎమ్‌సీ రోజుకు 50 కేసులను గుర్తించిందని.. కాని నెలాఖరు నాటికి ఆ సంఖ్య కేవలం 20కి పడిపోయిందని తెలిపారు. జూన్ 6 శనివారం నాడు కేవలం పది కొత్త కేసులు మాత్రమే వచ్చాయన్నారు. మే 31 నుంచి జూన్ 6 వరకు ఏడు రోజుల వ్యవధిలో కొత్తగా 148 కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు.

ధారావిలోని జీ నార్త్ వార్డ్‌లో బీఎమ్‌సీ 13 'హై రిస్క్' ప్రాంతాలను గుర్తించింది. ఇక్కడ నమోదవుతున్న కేసులలో మూడింట నాలుగు వంతుల మంది 21 నుంచి 60 సంవత్సరాల వయస్సులోపు వారే ఉన్నారని తెలిపింది. పె జూన్ 1నాటికి, హై రిస్క్ జోన్‌లలో 47,500 మందిని, విస్తృత కంటైనర్ జోన్లలో 1.25 లక్షల మందికి పరీక్షలు చేసినట్లు బీఎమ్‌సీ గణాంకాలు చెబుతున్నాయి. కరోనా రోగులను గుర్తించడానికి.. వ్యాప్తిని అరికట్టడానికి స్థానికంగా జ్వరం క్లినిక్‌లను ఏర్పాటు చేసినట్లు బీఎమ్‌సీ తెలిపింది. ద్ద సంఖ్యలో కుటుంబాలు దగ్గర దగ్గరగా ఉండటం.. దేశంలో అత్యధిక జనాభా సాంద్రత కలిగిన మురికివాడ కావడంతో ధారావి భారతదేశంలో ప్రమాదకర ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.(భయపెట్టి మరీ చికిత్స; భారీ ఫైన్‌)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు