సీనియర్‌ నటుల మాటల వార్‌!

28 May, 2016 13:28 IST|Sakshi
సీనియర్‌ నటుల మాటల వార్‌!

బాలీవుడ్‌లో సీనియర్ నటులైన నసీరుద్దీన్‌ షా, అనుపమ్ ఖేర్‌ మధ్య మాటల యుద్ధం మొదలైంది. కశ్మీర్ పండిట్ల విషయంలో ఈ ఇద్దరు నటులు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నసీరుద్దీన్‌ షా వివరణ ఇవ్వడంతో ఈ వివాదం సమసిపోయే అవకాశం కనిపిస్తోంది.

వివాదం ఏమిటి?
తన తాజా చిత్రం 'వెయిటింగ్‌' ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల ఢిల్లీలో నసీరుద్దీన్‌ షా అనుపమ్‌ ఖేర్‌పై విమర్శనాస్త్రాలు సంధించాడు. 'ఎన్నడూ కశ్మీర్‌లో నివసించని వ్యక్తి కశ్మీర్‌ పండిట్ల కోసం పోరాటం ప్రారంభించాడు. నిజానికి ఆయనే ఓ నిర్వాసితుడైనట్టు వ్యవహరిస్తున్నాడు' అని షా పేర్కొన్నాడు. షా విమర్శలపై ఖేర్‌ ట్విట్టర్‌లో బదులిచ్చాడు. 'జయహో షాగారు. మీ లాజిక్ ప్రకారం ఎన్నారైలు ఇండియా గురించి మాట్లాడవద్దన్న మాట' అని వ్యంగ్యంగా పేర్కొన్నాడు. ఖేర్‌కు బాలీవుడ్ ప్రముఖులు అశోక్ పండిట్‌, మధుర్ బండార్కర్‌ మద్దతు పలికారు. ఖేర్‌కు షా క్షమాపణ చెప్పాలని దర్శకుడు అశోక్ పండిట్ డిమాండ్ చేశారు. దీంతో నసీరుద్దీన్ షా స్పందిస్తూ ఖేర్‌ను ఉద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని వివరణ ఇచ్చాడు.

>
మరిన్ని వార్తలు