పెట్రోల్‌కు సమానంగా డీజిల్‌ ధర

24 Jun, 2020 10:35 IST|Sakshi

న్యూఢిల్లీ :  వరుసగా 18వ రోజు దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. దీంతో బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు దాదాపు ఒకే ధర పలుకుతున్నాయి. అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర 79.88 రూపాయలుగా కాగా, డీజిల్‌ ధర 79.40 రుపాయలుగా ఉంది. అంటే ఒక్క రోజులో లీటర్‌ డీజిల్‌పై ధర 48 పైసలు పెరిగింది. 18 రోజుల వ్యవధిలో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 9.41రూపాయలు, డీజిల్‌ 9.58 రూపాయలు పెరిగాయి. ఇంటర్నేషనల్‌‌ బెంచ్‌‌మార్క్ రేట్ల ప్రకారం ఎక్కడైనా పెట్రోల్‌‌ ధర డీజిల్‌‌ కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ ఢిల్లీ ప్రభుత్వం డీజిల్‌‌పై వ్యాట్‌‌ను భారీగా పెంచడంతో దేశ రాజధానిలో పెట్రోల్‌ కంటే డీజిల్‌ ఖరీదుగా మారింది. అయినప్పటికీ ఇతర మెట్రో నగరాలైన కోల్‌కత్తా, ముంబై , చెన్నైలలో డీజిల్‌ రేట్ల కంటే పెట్రోల్‌ ధరలు అధికంగా ఉన్నాయి. (లాక్‌డౌన్‌ వేళ పెట్రో సెగలు)

ప్రపంచవ్యాప్తంగా రవాణా, పారిశ్రామిక కార్యకలాపాలపై పరిమితులను సడలించడంతో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జూన్‌ 7 కు ముందు లాక్‌డౌన్‌ కారణంగా 82 రోజుల పాటు దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. మెట్రో నగరాల్లో బుధవారం పెట్రోల్‌ ధరలు మారకుండా డీజిల్‌ ధరలను పెంచడంతో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. (వరుసగా 17వ రోజూ పెట్రో వడ్డన)

నగరం పెట్రోల్‌ డీజిల్‌
ఢిల్లీ 79.76 79.88
కోల్‌కత్తా 81,45 75,06
ముంబై 86,54 78,22
చెన్నై 83,04 77,17

(సోర్స్‌: ఇండియన్ ఆయిల్)

>
మరిన్ని వార్తలు