ఇంటికి వెళ్లగానే దీపా కర్మాకర్ ఏం చేసింది?

24 Aug, 2016 08:29 IST|Sakshi
ఇంటికి వెళ్లగానే దీపా కర్మాకర్ ఏం చేసింది?

రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం శాయశక్తులా కృషి చేసి, వెంట్రుక వాసిలో అదృష్టాన్ని మిస్సయిన దీపా కర్మాకర్.. ఇంటికి రాగానే పుస్తకాలు తీసింది. ఇంటికి వచ్చిన మర్నాటి నుంచే ఆమెకు ఎంఏ పరీక్షలు ఉన్నాయి. త్రిపుర యూనివర్సిటీ డిస్టెన్స్ లెర్నింగ్ సెంటర్ ద్వారా ఆమె ఎంఏ రెండో సెమిస్టర్ పరీక్షలకు హాజరైంది. పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ తనకు త్వరలోనే వస్తుందని ఆమె గట్టి నమ్మకంతో చెప్పింది. ఒకవైపు క్రీడాంశాలపై అపారమైన ఆసక్తి చూపుతూనే, చదువు మీద కూడా ఇంత శ్రద్ధ పెట్టడం అద్భుతమని త్రిపుర యూనివర్సిటీ అధికారులు అంటున్నారు. సాధారణంగా క్రీడాకారులు చదువును పక్కన పెట్టేస్తారు. ఎప్పుడో వీలైనప్పుడు పరీక్షలు రాస్తారు. కానీ, దీప మాత్రం అలా కాకుండా అకుంఠిత దీక్షతో రియో నుంచి వచ్చిన మర్నాడే పరీక్షలకు హాజరైంది.. బాగా రాసింది కూడానట. పరీక్షలు తప్పించుకోడానికి వంకలు వెతికే పిల్లలు ఆమెను చూసి నేర్చుకోవాలని అధ్యాపకులు అంటున్ నారు.

జిమ్నాస్టిక్స్ కోచింగ్, ప్రాక్టీసుకు చాలా సమయం పడుతుందని, అయినా దీప మాత్రం ఎప్పుడూ చదువును నిర్లక్ష్యం చేయలేదని ఆమె కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు. చివరకు రియోకు వెళ్లేటప్పుడు కూడా ఆమె పుస్తకాలు తీసుకెళ్లిందట. మధ్యలో ఖాళీ దొరికితే చదువుకుందామని అలా తీసుకెళ్లిందని ఆమె తల్లి గౌరి చెప్పారు. మన దేశంలో చదువా.. ఆటలా అని ఏదో ఒకటి ఎంచుకోమంటారని, కానీ రెండూ ఒకేసారి చేయొచ్చని దీపా కర్మాకర్ నిరూపించిందని ఆమెతో పాటు పరీక్షకు హాజరైన యువకుడు చెప్పాడు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒక్క కేసు; ఎన్నో ట్విస్ట్‌లు!

‘నా పేరు సాక్షి.. నాన్న పేరు సంతోష్‌’

ఈనాటి ముఖ్యాంశాలు

ఆ బాలుడి నోట్లో 526 దంతాలు!

రాయ్‌బరేలీ ప్రమాదంలో 25 మందిపై కేసు

పోలీసులకు చుక్కలు చూపించిన విద్యార్థిని

మోదీ, అమిత్‌ షాలతో నాదెండ్ల భేటీ

యుద్ధ ప్రాతిపదికన సమస్యలు పరిష్కరించాలి

‘అదృష్టం.. ఈ రోజు ముందు సీట్లో కూర్చోలేదు’

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు; కశ్మీర్‌లో పంచాయతీ..!

మట్టికుప్పల కింద మనిషి.. బతికాడా..!

క్రికెట్‌లో గొడవ.. కత్తెరతో పొడిచి హత్య

మూకదాడులు ఎలా చేయాలో నేర్పిస్తారేమో!

ఆరోగ్య మంత్రి మాటలు అమలయ్యేనా?

ఈ రాఖీలు వేటితో చేశారో చెప్పగలరా?

మోదీని అనుకరించారు.. అడ్డంగా బుక్కయ్యారు

‘ఉన్నావో రేప్‌’ ఎటుపోతుంది?

తలాక్‌ చెప్పినందుకు మహిళ ఆత్మహత్యాయత్నం

మరో రెండ్రోజులు భారీ వర్షాలు

సిద్ధార్థ అంత్యక్రియలకు ఎస్‌ఎం కృష్ణ

కర్ణాటక నూతన స్పీకర్‌గా విశ్వేశ్వర హెగ్డే

ఆ లేఖ ఆలస్యంగా అందింది: సీజేఐ

‘దీపిక, రణబీర్‌ డ్రగ్స్‌ తీసుకుంటారు.. ఇదిగో సాక్ష్యం’

దేశ చరిత్రలో తొలిసారి.. సిట్టింగ్‌ జడ్జ్‌పై

ఆగస్టు 6, 7 తేదీల్లో సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన

చత్తీస్‌గఢ్‌లో పేలుడు : జవాన్‌ మృతి

మిస్టరీగానే జయలలిత మరణం

స్పీడ్‌ పెరిగిన...  హీరో మోటార్స్‌ 

స్పీకర్‌ అధికారం మాకెందుకు?

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌పై బాబు గోగినేని ప్రశ్నల వర్షం

కంగనాకు ఖరీదైన కారు గిఫ్ట్‌..!

కాకినాడ వీధుల్లో బన్నీ సందడి

కూతురికి 'నైరా' అని పేరు పెట్టిన నటి!

సంజయ్‌ దత్‌ చెప్పాడనే చేశా!

సైమాకు అతిథులుగా..!