నీతిఅయోగ్ సీఈఓగా అమితాబ్ కాంత్

10 Apr, 2017 12:54 IST|Sakshi

న్యూఢిల్లీ : నీతి ఆయోగ్  (భారత జాతీయ పరివర్తన సంస్థ)కు నూతన సీఈవోగా అమితాబ్ కాంత్ నియమితులయ్యారు. అమితాబ్ కాంత్ ను నియమించినట్లు కేంద్ర సిబ్బంది గురువారం వెల్లడించాయి. ప్రస్తుతం నీతి ఆయోగ్‌ సీఈవోగా ఉన్న సింధుశ్రీ ఖుల్లార్‌ పదవీ కాలం ముగియటంతో ఆమె స్థానంలో ఇండస్ట్రియల్‌ పాలసీ, ప్రమోషన్‌ శాఖ కార్యదర్శి అమితాబ్‌ కాంత్ కు బాధ్యతలు అప్పగించింది.  అమితాబ్ కాంత్ 1980 బ్యాచ్ కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ఇప్పటివరకూ ఆయన పారిశ్రామిక విధానం మరియు ప్రోత్సాహం శాఖ కార్యదర్శిగా పని చేశారు. అమితాబ్ కాంత్ 2016 ఫిబ్రవరిలో పదవీవిరమణ చేయనున్నారు.

కాగా గత ఆరు దశాబ్దాల కాలంలో ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంకేతిక, జనాభా పరమైన అంశాల్లో భారత ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదే క్రమంలో దేశాభివృద్ధి కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లోనూ మార్పులు వచ్చాయి. కాలానుగుణంగా సంభవించిన మార్పులను దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆశలను, అవసరాలను తీర్చేందుకు ప్రణాళిక సంఘం స్థానంలో 2015 జనవరి 1న నీతి ఆయోగ్ ఏర్పాటైంది. దేశంలోని అన్ని ప్రాంతాలను  దేశాభివృద్ధిలో భాగం చేసేందుకు నీతి ఆయోగ్‌లో రాష్ట్రాలకు సముచిత స్థానం కల్పించారు.

టీం-నీతి ఆయోగ్
 చైర్‌పర్సన్: నరేంద్రమోదీ, భారత ప్రధాని
 వైస్ చైర్‌పర్సన్: అర్వింద్ పనగారియా
 శాశ్వత సభ్యులు: బిబేక్ దెబ్రోయ్,
 వీకే సారస్వత్, ప్రొ. రమేశ్‌చంద్

ప్రత్యేక ఆహ్వానితులు:
 నితిన్ గడ్కరీ, కేంద్ర రవాణా
 జాతీయ రహదారుల శాఖ
 థావర్ చంద్ గెహ్లాట్,
 కేంద్ర సామాజిక న్యాయ శాఖ
 స్మృతి జుబిన్ ఇరానీ,
 కేంద్ర మానవవనరుల శాఖ
 చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్:
అమితాబ్ కాంత్
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు