తెలంగాణ హైకోర్టు ఏర్పాటుపై చర్చ

16 Oct, 2014 17:13 IST|Sakshi
కింగ్ కోఠీలోని పరదా ప్యాలెస్

న్యూఢిల్లీ:  హైదరాబాద్ కింగ్‌కోఠిలోని పరదా ప్యాలెస్లో తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేసే అంశంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తుతో  తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఈరోజు చర్చలు జరిపారు. తెలంగాణ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడానికి ప్రధాన న్యాయమూర్తి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న హైకోర్టు భవనాన్ని తాత్కాలికంగా ఏపికి కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దాంతో తెలంగాణ హైకోర్టును కింగ్‌కోఠిలోని నిజాం పరదా ప్యాలెస్లో లేదా ఎర్రమంజిల్ ఆర్ అండ్ బీ భవనంలో  ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది.   రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో కలిసి రాజీవ్ శర్మ ఈ రెండు భవనాలను పరిశీలించారు.
**

మరిన్ని వార్తలు