జవాన్లకు కేంద్రం దీపావళి కానుక

19 Oct, 2017 03:47 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని పర్వత, మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించే సాయుధ, పారామిలటరీ బలగాలకు కేంద్రం దీపావళి కానుక అందించింది. శాటిలైట్‌ ఫోన్లు వాడుకున్నందుకు జవాన్లు ప్రతి నెలా చెల్లిస్తున్న రూ.500 చార్జీలను నేటి నుంచి రద్దు చేస్తున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి మనోజ్‌ సిన్హా ప్రకటించారు.

అంతేకాకుండా ఈ ఫోన్ల కాల్‌ చార్జీలను నిమిషానికి రూ.5 నుంచి రూ.1కి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. జవాన్లు తమ కుటుంబ సభ్యులతో మరింత ఎక్కువ సమయం మాట్లాడటానికి ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. తాజా నిర్ణయం వల్ల కేంద్రంపై రూ.3 నుంచి 4 కోట్ల భారం పడుతుందన్నారు.

మరిన్ని వార్తలు