స్టాలిన్‌పై నిప్పులు చెరిగిన పన్నీర్!

29 Mar, 2017 19:40 IST|Sakshi
స్టాలిన్‌పై నిప్పులు చెరిగిన పన్నీర్!

చెన్నై: డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌కు ఓటమి భయం పట్టుకుందని, ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో డీఎంకే ఓటమి ఖాయమని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అన్నారు. ఆ ఓటమి భయంతోనే దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంబంధించి అన్నాడీఎంకే తాత్కాలిక కార్యదర్శి వీకే శశికళకు వ్యతిరేకంగా తన వద్ద ఉన్న ఆధారాలను బటయపెట్టాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. అవినీతి గురించి మాట్లాడే అర్హత డీఎంకే నేతలకు లేదని, దేశంలో పెద్ద కుంభకోణాలు వారి హయాంలోనే జరిగాయని విమర్శించారు. అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ అభ్యర్థి ఈ మధుసూదనన్ పై ప్రజలు నమ్మకం ఉంచారని, డీఎంకే అభ్యర్థి మరుదు గణేషన్ కు ఓటమి తప్పదని పునరుద్ఘాటించారు.

గత సోమవారం డీఎంకే అధినేత స్టాలిన్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ.. జయలలిత మృతిపై పన్నీర్ సెల్వం వద్ద ఉన్న సాక్ష్యాలను, అవినీతిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సాక్ష్యాలను బహిర్గతం చేయకపోతే ప్రజలకు అన్యాయం చేసిన వ్యక్తిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. దీనిపై పన్నీర్ సెల్వం స్పందిస్తూ.. అవినీతి గురించి మాట్లాడే నైతిక అర్హత స్టాలిన్‌కు లేదన్నారు. 2జీ, ఎయిర్ మాక్సిస్ లాంటి దేశంలోనే అతిపెద్ద కుంభకోణాలు డీఎంకే నేతలు చేసినవేనంటూ నిప్పులు చెరిగారు. అయితే శశికళ తనను అమ్మ జయలలిత నుంచి దూరం చేసేందుకు 2006 నుంచి చేసిన ప్రయత్నాలే ఆ 90 శాతం రహస్యాలని చెప్పారు.

అమ్మ ఆస్పత్రిలో ఉన్నప్పుడు  కనీసం ఆమెను చూడలేకపోయానని, చికిత్స కోసం జయలలితను విదేశాలకు తీసుకెళ్లాలని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైతో చర్చించినట్లు వెల్లడించారు. అమ్మను ఆరోగ్యంగా ఇంటికి తీసుకురావాలని.. లేనిపక్షంలో మనపైనే కాదు మన ఇళ్లమీద దాడులు జరుగుతాయని ఆరోగ్యశాఖమంత్రి సీ విజయభాస్కర్‌కు సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్కే నగర్ ఎన్నికల బరిలో చివరికి రేసులో 62 మంది మిగిలారు. అయితే ఇక్కడ చతుర్మఖ పోరు తప్పదనిపిస్తోంది

మరిన్ని వార్తలు