పీఏలుగా బంధువులు వద్దు: మోడీ

28 May, 2014 18:16 IST|Sakshi
పీఏలుగా బంధువులు వద్దు: మోడీ

తన కార్యాలయానికి వచ్చే ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారాలు కావాలని ప్రధాని కార్యాలయ అధికారులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు. సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించేలా పీఎంఓ నడుచుకోవాలని, రాష్ట్రాల సమస్యలను ప్రాధాన్య క్రమంలో తీర్చాలని ఆయన చెప్పారు.

గతకాలంలో ఉన్న మంచి అంశాలను ఇకపై కూడా కొనసాగిస్తామని మోడీ తెలిపారు. ఇక మంత్రులు ఖర్చులను తగ్గించుకోవాలని, బంధువులను ఎట్టి పరిస్థితుల్లోనూ పీఏలుగా పెట్టుకోవద్దని స్పష్టంగా సూచించారు.

మరిన్ని వార్తలు