కు.ని. వైద్యుడి అరెస్ట్

14 Nov, 2014 02:54 IST|Sakshi
కు.ని. వైద్యుడి అరెస్ట్
  • జ్యుడీషియల్ దర్యాప్తునకు సీఎం ఆదేశం
  • బిలాస్‌పూర్/ఐరాస: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో నిర్లక్ష్యంగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసి 13 మంది మహిళల మృతికి కారణమైనవాడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ఆర్‌కే గుప్తాను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇందులో తన తప్పేం లేదని, ప్రభుత్వం సరఫరా చేసిన నాణ్యత లేని ఔషధాల కారణంగానే సర్జరీ అనంతర సమస్యలు తలెత్తి మరణాలు సంభవించాయని డాక్టర్ గుప్తా పేర్కొన్నారు.

    ఈ ఘటనపై ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ గురువారం న్యాయవిచారణకు ఆదేశించారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుంచి 16 మంది వైద్యుల బృందం గురువారం బిలాస్‌పూర్ బాధితులను పరీక్షించారు.  కాగా నాణ్యత లేని ఔషధాలను సరఫరా చేసిన మహావర్ ఫార్మాకు చెందిన ఉత్పత్తి కేంద్రాన్ని అధికారులు సీజ్ చేశారు. మరోవైపుఘటనపై ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీమూన్ ఆందోళన వ్యక్తం చేశారు.
     

మరిన్ని వార్తలు