42 మంది వైద్యుల అరెస్ట్‌

27 Apr, 2017 19:40 IST|Sakshi

తిరువళ్లూరు: ఉన్నత విద్యలో ప్రభుత్వ డాక్టర్లకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలనే డిమాండ్‌తో రాస్తారోకో చేస్తున్న వైద్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారం రోజుల నుంచి విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నా తమిళనాడు ప్రభుత్వం స్పందించటం లేదంటూ గురువారం మధ్యాహ్నం తిరుపతి–చెన్నై జాతీయ రహదారిలో తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాల ఎదుట డాక్టర్లు ఆందోళనకు దిగారు.

రాస్తారోకోతో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. దీంతో అనుమతి లేకుండా రాస్తారోకో చేపట్టారంటూ పోలీసులు వైద్యులను అరెస్టు చేశారు. ప్రస్తుతం రిజర్వేషన్‌ రద్దు చేసిన నేపథ్యంలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగాలకు రావడానికి ఎవ్వరూ ఆసక్తి చూపరని తద్వారా ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ల కొరత ఏర్పడే అవకాశం వుందని ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు. అరెస్టయిన 42 మంది వైద్యుల్లో 16 మహిళలు కూడా ఉన్నారు. ఆందోళన కారణంగా తిరువళ్లూరు వైద్యశాలకు వచ్చిన రోగులు సేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Reservations, doctors arrested, MBBS,
ఎంబీబీఎస్‌, రిజర్వేషన్లు, వైద్యుల అరెస్ట్‌, తిరువళ్లూరు

మరిన్ని వార్తలు