వారిని వదిలిపెట్టకండి

16 Apr, 2020 10:59 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని మోరీదాబాద్‌లో వైద్య ఆరోగ్య సిబ్బందిపై దాడి చేసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాధ్‌ ఆదేశించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అనుమానితులను క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. అయితే ఈ క్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బందిపైన దాడులు చేస్తున్న ఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అంతకు ముందు వైద్యుల పై జరిగిన దాడిని మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లోని మోరీదాబాద్‌లో వైద్యాఆరోగ్య సిబ్బందిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. మోరీదాబాద్‌లో ఇద్దరు కరోనా అనుమానితులు ఉన్నారనే సమాచారంతో వారిని తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన వైద్య ఆరోగ్య సిబ్బందిపై అక్కడి వారు రాళ్ల దాడిచేశారు. అంతేకాకుండా వారిని రక్షించడానికి వచ్చిన పోలీసులపై కూడా ఇదే తరహాలో రాళ్లదాడికి పాల్పడ్డారు. 

ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన వారందరిని గుర్తించి వారిపై నేషనల్‌ సెక్యూరిటి యాక్ట్‌ కింద కేసులు నమోదు చేయాలని సీఎం యోగి ఆదిత్యనాధ్‌ పోలీసులను ఆదేశించారు. ప్రభుత్వఆస్తులు ధ్వంసం కావడంతో అవి కూడా వారితోనే కట్టించాలని ఆదేశించారు. ఈ దాడికి పాల్పడిన 10 మందిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు భారత్‌లో 12,380 కరోనా కేసులు నమోదు కాగా 414 మంది మరణించారు. 

మరిన్ని వార్తలు