హిజ్రాకు చికిత్స చేసేందుకు డాక్టర్ల నిరాకరణ

3 Oct, 2019 07:49 IST|Sakshi

చెన్నై,తిరుత్తణి: అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన హిజ్రాకు చికిత్స చేసేందుకు  ప్రభుత్వ వైద్యులు నిరాకరించిన ఘటన తిరుత్తణి ప్ర భుత్వాస్పత్రిలో బుధవారం చోటుచేసుకుంది. తిరుత్తణి  పెరియార్‌నగర్‌కు చెందిన  కావ్య(40) అనే హిజ్రాకు  జ్వరంతో పాటు వాంతులు, విరేచనాలు రావడంతో చికిత్స కోసం తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. అయితే హిజ్రాకు చికిత్స చేసేందుకు వైద్యులు నిరాకరించారు. సుమారు 2 గంటల పాటు అనా రోగ్యంతో బాధపడుతున్నా కనీసం వైద్యులు  పలకరించేందుకు సైతం ముందుకు రాకపోవడంతో తోటి హిజ్రాలు ఎందుకు వైద్యం చేయరని ఆస్పత్రి చీఫ్‌ డాక్టర్‌ రాధికను  ప్రశ్నిం చారు. వారి ప్రశ్నలను డాక్టర్‌ పట్టించుకోకపోవడంతో  హిజ్రాలు ఆస్పత్రి ప్రాంగణం వద్ద బైఠాయించారు. అక్కడికి వచ్చిన తిరువళ్లూరు జిల్లా ఆరోగ్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర దయాళన్‌కు సమస్యను వివరించారు. చివరకు జాయింట్‌ డైరెక్టర్‌  ఆదేశాలతో వైద్యులు హిజ్రాకు చికిత్స చేశారు.

మరిన్ని వార్తలు