ఇన్ని ‘మింగే’శాడు   

18 Jun, 2019 12:08 IST|Sakshi

ఉదయపూర్ : ఇది ఒక రేర్‌ కేసు..  రేర్‌ ఆపరేషన్.
నలుగురి శ్రమ
గంటన్నర ఆపరేషన్‌ 
80 వస్తువులు 
180 గ్రాములు..
వయసు 40 ఏళ్లు
నలుగురు వైద్యులు అతికష్టం మీద  రోగి మింగేసిన వస్తులను బయటకు తీశారు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న వ్యక్తి (40)ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతని ఎక్స్‌రే రిపోర్టును చూసిన వైద్యులే షాక్‌ అయ్యారు. తాళం చెవి, చైన్స్‌తో పాటు ఇతర మెటల్స్‌ ఏకంగా 80 వస్తువులున్నట్లు  గుర్తించారు. వెంటనే అతనికి అపరేషన్‌  చేయాలని నిర్ణయించారు. నలుగురు డాక్టర్ల బృందం 90 నిమిషాల పాటు శస్త్రచికిత్స చేసి ఆ వస్తువులను తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు.  ఇంతకీ ఇన్ని వస్తువులను కడుపులో దాచుకున్న  (మింగేసిన) వ్యక్తి ఓ మానసిక రోగి అట.  

ఇది చాలా రేర్‌ కేస్‌ అని, మొత్తం 800 గ్రాముల బరువున్న వస్తులను ఆపరేషన​ ద్వారా తొలగించామని డా.డి. కెశర్మ వెల్లడించారు. గోర్లు, ఐరన్‌ తీగ, తాళం చెవి, పొగ పీల్చే చిల్లం తదితర వస్తువులున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం రోగి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. 

మరిన్ని వార్తలు