పెట్రోలియం శాఖ వాళ్లు దేవుళ్లా: సుప్రీం

10 Jul, 2018 03:05 IST|Sakshi

న్యూఢిల్లీ: పెట్రోలియం కోక్‌ దిగుమతులపై నిషేధం విషయమై సమయానికి స్పందించకపోవడంతో పెట్రోలియం మంత్రిత్వ శాఖపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘పెట్రోలియం శాఖ వాళ్లు దేవుళ్లా? వాళ్లకిష్టమొచ్చినప్పుడు స్పందిస్తారా? భారత ప్రభుత్వం కన్నా పెద్దదా పెట్రోలియం శాఖ? పనిలేకుండా కూర్చున్న జడ్జీలు వారికి కావాల్సినంత సమయం ఇస్తారని అనుకుంటున్నారా?’ అంటూ జస్టిస్‌ ఎంబీ లోకూర్, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెట్రోలియం కోక్‌ (బొగ్గు ఆకారంలో ఉండే పారిశ్రామిక ఇంధనం) దిగుమతులపై నిషేధానికి సంబంధించి పెట్రోలియం శాఖ తన నివేదికను కేవలం ఆదివారమే తమకు సమర్పించిందని పర్యావరణ, అటవీ శాఖ కోర్టుకు చెప్పడంతో జడ్జీలు కోపోద్రిక్తులయ్యారు. పెట్రోలియం శాఖకు 25 వేల రూపాయల జరిమానా విధించి నాలుగు రోజుల్లో చెల్లించాల్సిందేనని ఆదేశించారు. 

మరిన్ని వార్తలు