అరే దోస్త్‌.. ప్లీజ్‌ లేవరా !

16 Sep, 2019 07:59 IST|Sakshi
మృతి చెందిన కుక్క కళేబరం ముందు రోదిస్తున్న మరో కుక్క

కర్ణాటక, దొడ్డబళ్లాపురం: ఎక్కడైనా రోడ్డు ప్రమాదంలో మనిషి గాయపడ్డా, మృతి చెందినా సాటి మనిషిగా మనుషులు సాయపడకపోగా మొబైల్‌లో వీడియోలు తీయడం మనం చూస్తుంటాం... అలాంటి దృశ్యాలు చూసినప్పుడు మానవత్వం మంటగలిసిందని బాధపడతాం.. అయితే అలా చేయడం మనుషులకేనని తమ కుక్క జాతికి లేదని ఒకకుక్క చాటి చెప్పింది. రామనగర శివారులో అర్చకరహళ్లి వద్ద రహదారిపై అపరిచిత వాహనం ఢీకొని ఒక కుక్క మృతి చెందింది. కుక్క కళేబరం ముందు మరో కుక్క చాలాసేపు రోదిస్తూ మృతి చెందిన కుక్కను లేపడానికి శతవిధాలా ప్రయత్నించింది. దరిదాపులకు ఎవ్వరినీ రానివ్వలేదు. ఈ దృశ్యాలు స్థానికులకు కన్నీళ్లు తెప్పించాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా