ట్రంప్‌ పర్యటన : సీక్రెట్‌ ఏజెన్సీ ఏం చేస్తుంది?

24 Feb, 2020 09:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంతో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నేటి(సోమవారం) మధ్యాహ్నం అడుగిడనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అమెరికాకు చెందినసీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు, భారత్‌కు చెందిన జాతీయ భద్రతా సిబ్బంది (ఎన్‌ఎస్‌జీ), స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ అధికారులతో పాటు భారీ సంఖ్యలో పోలీసులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. వీరితో పాటు దాదాపు 10 వేల మంది పోలీసులు గుజరాత్‌లోని పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు. వీటన్నింటిలో అత్యంత శక్తివంతమైన భద్రతా సిబ్బంది సీక్రెట్‌ ఏజెన్సీ. అమెరికా అధ్యక్షుడి రక్షణ విషయంలో సీక్రెట్‌ ఏజెన్సీ పాత్ర ఏంటో తెలుసుకుందాం..

అమెరికా అధ్యక్షుడితోపాటు ఆయన కుటుంబం రక్షణ బాధ్యతలను చూసుకునే బాధ్యత అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెన్సీదే.
 ప్రథమ పౌరుడి రక్షణకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఈ విభాగమే పర్యవేక్షిస్తుంటుంది.
 అధ్యక్షుడు ప్రయాణించే మార్గాన్ని శుభ్రంగా ఉంచటంతోపాటు అనుకోని ఆపద ఎదురైతే తప్పించుకునే మార్గాలు, ప్రణాళికలు సిద్ధంగా ఉంచుతుంది. 
ప్రమాదం సంభవిస్తే అవసరమైన రక్తాన్ని కూడా సిద్ధంగా ఉంచుతుంది.
 అధ్యక్షుడిని ఎల్లప్పుడూ అనుసరించి ఉండే వారికీ ఈ విభాగం రక్షణ కల్పిస్తుంది. 
అధ్యక్షునితో పాటు ఎల్లప్పుడు ఉండేవాటిలో 20 కిలోల బరువుండే జీరో హాలిబర్టన్‌ నల్లటి బ్రీఫ్‌కేస్‌ కూడా ఒకటి. ఇందులో అమెరికా అణు క్షిపణుల రహస్య కోడ్‌ భద్రపరిచి ఉంటుంది.
అధ్యక్షుడు విశ్రాంతి తీసుకునే గది వరకు సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌ అనుసరిస్తూనే ఉంటాడు. 
చట్టం ప్రకారం.. తనను ఒంటరిగా వదిలి వేయాలని అధ్యక్షుడు సైతం ఆ అధికారిని ఆదేశించలేడు. 
1865లో ఏర్పాటైన ఈ విభాగం 1901 నుంచి అధ్యక్షుడికి రక్షణగా నిలుస్తోంది. 
సుమారు 7 వేల మందితో కూడిన ఈ విభాగంలో 25% మహిళ లుంటారు.
 ప్రపంచంలోని ఏ దేశ సైన్యం కంటే కూడా అత్యంత కఠినమైన శిక్షణ వీరికి ఇస్తారు.
 సీక్రెట్‌ సర్వీస్‌ కోసం అందిన ప్రతి 100 దరఖాస్తుల్లో ఒకటి కంటే తక్కువగానే ఎంపిక వుతుంటాయి. 
వర్జీనియాలో ఉండే ఈ విభాగం లో శిక్షణ పొందిన వారు.. అధ్యక్షుడి కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ హాలీవుడ్‌ సినిమా ల్లో చూపిస్తున్న విధంగా ప్రమాణ చేయరట!

ట్రంప్‌ నేటి షెడ్యూల్‌..
ఉదయం..
11:40.. అహ్మదాబాద్‌లోని సర్దార్‌ 
వల్లభాయ్‌ అంతర్జాతీయ 
విమానాశ్రయానికి చేరుకోనున్న ట్రంప్‌

మధ్యాహ్నం 
12:15.. ట్రంప్, మోదీలు కలసి 
సబర్మతీ ఆశ్రమానికి చేరుకుంటారు
01:05.. మొతెరా స్టేడియంలో 
నమస్తే ట్రంప్‌ కార్యక్రమం
03:30.. ఆగ్రాకు ప్రయాణం

సాయంత్రం 
04:45.. ఆగ్రాకు చేరుకుంటారు
05:15.. తాజ్‌మహల్‌ సందర్శన
06:45.. ఢిల్లీకి ప్రయాణం
07:30.. ఢిల్లీకి చేరుకుంటారు

చదవండి : 

ట్రంప్‌ దంపతుల లవ్‌ స్టోరీ

మోదీ, నేను మంచి ఫ్రెండ్స్‌!

‘అగ్ర’జుడి ఆగమనం నేడే

మరిన్ని వార్తలు