మాట ముచ్చట C\O హైదరాబాద్‌ హౌస్‌

26 Feb, 2020 02:44 IST|Sakshi

దేశాధినేతలెవరైనా.. అధికారిక చర్చలు జరిగేది అందులోనే

హస్తినలోని ప్రభుత్వ భవనాలకు తలమానికం

రాతి నగిషీలు.. గుమ్మటం.. అన్నీ ప్రత్యేకమే

అంతటా  అబ్బురపరిచే యూరోపియన్‌ నిర్మాణ శైలి 

8.77 ఎకరాల్లో నిర్మించుకున్న ఏడో నిజాం

స్వాతంత్య్రానంతరం స్వాధీనం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం  

హైదరాబాద్‌ హౌస్‌..దేశానికి విదేశీ దేశాధినేతలు వచ్చినప్పుడల్లా ప్రపంచానికి ఈ పేరు వినిపిస్తుంది. ప్రముఖులు రావడం కంటే వారితో మన దేశం చర్చలు జరిపి చేసుకొనే ఒప్పందాలపైనే ప్రపంచ దృష్టి నిలుస్తుంది. ఆ ఒప్పందాలతోపాటే మార్మోగే పేరు హైదరాబాద్‌ హౌస్‌. ఇప్పుడు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌తో కీలక ఒప్పందాలకు, ద్వైపాక్షిక చర్చలకు కూడా ఈ భవనమే వేదికై అంతర్జాతీయంగా మరోసారి వెలుగు వెలిగింది.(రాష్ట్రపతి విందుకు కేసీఆర్‌ హాజరు)

ఇంతకూ ఆ భవనమే ఎందుకు? 
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌కు వచ్చినప్పుడు ప్రధాని మోదీతో కలసి ఓ ఊయలలో కూర్చొని కాసేపు మాట్లాడారు. రెండోసారి ఆయన.. మ హాబలిపురంలో సముద్ర తీరాన కొబ్బరి బొండాలను ఆస్వాదిస్తూ చర్చించుకున్నారు. అవ న్నీ సరదా చర్చలకే పరిమితం. అసలు సిసలు చర్చలంటే చలో హైదరాబాద్‌ హౌస్‌ అనాల్సిందే. రెండు దేశాల మధ్య ఒప్పందాలు అనగానే వాటిని ఫలప్రదం చేసే స్థాయిలో చర్చలు జరగాలి. ఆ చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించే ప్రాంగణం ఉండాలి. అది అబ్బురపరిచే రీతిలో ఠీవిగా ఉండాలి. వాటన్నింటికి కేరాఫ్‌ అడ్రస్‌ హైదరాబాద్‌ హౌసే. ఎందుకంటే ఆ నిర్మాణ కౌశలం గంభీరంగా ఉంటుంది, అందులోని ఇంటీరియర్‌ రాజసా న్ని ఒలకబోస్తుంది. పచ్చికబయళ్లు గంభీరవా తావరణాన్ని తేలికపరుస్తాయి. ప్రవేశమార్గంలో వాడిన రాతి నగిషీలు మొదలు, భవనంపై న ఉన్న గుమ్మటం శిఖరం వరకు అన్నీ ప్రత్యేకమే, అందుకే ఆ భవనం ఢిల్లీలో ఓ ప్రత్యేకం. (నమస్తే ట్రంప్‌ అదిరింది... )

నిజాం ప్యాలెస్‌ సే  హైదరాబాద్‌ హౌస్‌ తక్‌
ప్రపంచ ధనవంతుడిగా వెలుగొందిన ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఏది చేసినా తన స్థాయికి తగ్గట్టే ఉండాలని కోరుకున్నాడు. దానికి అప్పట్లోనే హైదరాబాద్‌కు ఒనగూరిన హంగులే సాక్ష్యం. రాచరికంలో కనిపించిన ఆ ర్భాటాన్ని అమితంగా ఇష్టపడే ఆయన కలకు సజీవ సాక్ష్యమే ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌. 

విదేశాల నుంచి వస్తువులు..
దేశ రాజధానిలో తమకు ఓ విడిది ఉండాలనే ది అప్పటి సంస్థానాధీశుల కోరిక. అందుకు నాటి ఆంగ్ల పాలకులు అంగీకరించారు. అంతే స్థలాలు సమకూర్చుకొని భారీ ప్యాలెస్‌లు ని ర్మించుకున్నారు. ఢిల్లీ అనగానే మన మదిలో మెదిలేది ఇండియా గేట్‌. ఔరా అనిపించేలా వెలుగొందుతున్న రాష్ట్రపతి భవన్‌. ఈ రెండు నిర్మాణాలను రూపొందించింది ఒక్కరే. ఆయనే ఎడ్విన్‌ లూటెన్స్‌. ఆంగ్లేయుల కాలంలో విఖ్యాత ఆర్కిటెక్ట్‌. నాటి వైస్రాయ్‌ అధికారిక నివాసం కోసం అద్భుతంగా రూపొందించిన భవనం అప్పట్లో ప్రపంచంలోనే గొప్ప ప్యాలె స్‌గా అలరారింది. దాన్ని చూడగానే ఢిల్లీలోని తన అధికారిక నివాసం అలాగే ఉండాలన్న ఉ ద్దేశంతో ఎడ్విన్‌కు దాని ప్రణాళిక బాధ్యతలు అప్పగించాడు ఏడో నిజాం. ఇంకేముంది.. ఫర్నిచర్‌ కోసం కలప, ఫ్లోరింగ్‌ కోసం రాళ్లు విదేశాల నుంచి చకచకా వచ్చేశాయి. 1926లో నిర్మాణం ప్రారంభించిన రెండేళ్లలో పూర్తి చేశా రు. 8.77 ఎకరాల విస్తీర్ణంలో 36 గదులతో కూడిన ఈ భవన నిర్మాణానికి రూ. 1.86 కో ట్లు ఖర్చయ్యాయి. తొలుత నిజాం ప్యాలెస్‌గా పేరొందిన ఈ భవనం స్వాతంత్య్రానంతరం హైదరాబాద్‌ హౌస్‌గా మారింది. 

కొడుకులకు నచ్చలేదు.... 
నిజాం జీవన విధానం పూర్తి ఇస్లాం పద్ధతిలో ఉండేది. మతానికి ఆయన ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. తన వారసులనూ అలానే పెంచా రు. ఆయన కుమారులు అంతకంటే ఎక్కువ గా మతానికి ప్రాధాన్యం ఇచ్చారు. హైదరాబాద్‌ హౌస్‌ విషయంలో తండ్రీకొడుకుల మధ్య అభిప్రాయభేదాలకు కూడా అదే కారణమైంది. రాజప్రాసాదంలా ఉండాలన్న ఉద్దేశం తో హైదరాబాద్‌ హౌస్‌కు ఆయన ఆర్కిటెక్ట్‌గా నియమించుకున్న ఎడ్విన్‌కు నిర్మాణంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అప్పటికే సిద్ధమైన వైస్‌రాయ్‌ భవనంపై ఉండే గుమ్మటం (డోమ్‌) సాంచీలో ఉండే బౌద్ధస్థూపం నమూనాలో నిర్మించారు. దానికి కాస్త పోలికలుంటూనే యూరోపియన్‌ నిర్మాణ శైలితో నియో క్లాసికల్‌గా హైదరాబాద్‌ హౌస్‌పై డోమ్‌ను నిర్మించారు. దీంతోపాటు మొత్తం భవనం నాటి ఆధు నిక యురోపియన్‌ ఆర్కిటెక్ట్‌ శైలితో రూపొందింది. దీన్ని చూసి దేశవిదేశీ ప్రముఖులు అద్భుతంగా ఉందని మెచ్చకున్నారు. ఈ మెచ్చుకోలుకు నిజాం పొంగిపోయాడు. కానీ ఆయ న ఇద్దరు కుమారులు అజంజాహి, మొజం జాహీ మాత్రం నొచ్చుకున్నారు. అందుకే వారు ఆ భవనంలో ఉండలేమని తేల్చి చెప్పారు. కాసేపు భవనంలో కాలక్షేపం చేసినా.. తర్వాత వాళ్లు అందులోకి రావడానికి నిరాకరించారు. 

నాలుగు పర్యాయాలే వచ్చిన నిజాం
ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న ఆ అద్భుత ప్యాలెస్‌ను నిజాం సందర్శించింది మాత్రం నాలుగు పర్యాయాలేనట. 1928లో భవనం ప్రారంభానికి ఆయన వచ్చినప్పుడు ఢిల్లీ వీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. భారీ ర్యాలీ మధ్య ఆయన భవనానికి చేరుకుని అందులో విడిది చేశారు. ఆ తర్వాత 1932లో కుమారులతో కలిసి వచ్చారు. స్వాతంత్య్రానంతరం ఒక పర్యాయం వచ్చారు. హైదరాబాద్‌ సంస్థానం భారతయూనియన్‌లో విలీనం అయ్యాక రాజ్‌ప్రముఖ్‌గా బాధ్యతలు స్వీకరించిన నిజాం 1954లో చివరిసారి హైదరాబాద్‌ హౌస్‌కు వచ్చారు.  

నెహ్రూకు హైదరాబాద్‌ చాయ్‌ తాగించిందిక్కడే 
నిజాం తన చివరి పర్యటనలో భాగంగా ఆ ప్యాలెస్‌కు వచ్చినప్పుడు అక్కడ భారీ ఎత్తున గార్డెన్‌ పార్టీ ఏర్పాటు చేశారు. దానికి నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, నాటి రాష్ట్రపతి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. వారికి ఆయన ప్రత్యేకంగా హైదరాబాద్‌ చాయ్‌ తాగించారు. ప్యాలెస్‌ ముందు పచ్చికబయళ్లలో అటూఇటూ కలియతిరుగుతూ నెహ్రూ చాయ్‌ను ఆస్వాదించారని చెబుతారు.  

ఇప్పుడు అదే ప్రధాన ఆతిథ్య విడిది
విదేశీ ప్రముఖులు వస్తే చాలు ద్వైపాక్షిక చర్చలు, ఉమ్మడి విలేకరుల సమావేశాలు, సదస్సులు, స మావేశాలు..ఇలా అన్నింటికీ ఇప్పు డు హైదరాబాద్‌ హౌసే వేదిక. మోదీ ప్రధాని అయ్యాక భారత్‌కు విదేశీ దేశాధినేతల రాక బాగా పెరిగింది. దాంతోపాటు హైదరాబాద్‌ హౌస్‌లో సందడి కూడా అధికమైంది. 

ట్రంప్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

మరిన్ని వార్తలు