రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌ దంపతులు

25 Feb, 2020 10:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు, ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్‌కు ఘనస్వాగతం పలికారు. అనంతరం ట్రంప్‌ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.

(చదవండి : ట్రంప్‌కు ‘తాజ్‌’ను చూపించింది ఎవరో తెలుసా?)

ఆ తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌, సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ దళాధిపతులు, కాన్సులేట్‌ సభ్యులను ట్రంప్‌కు మోదీ పరిచయం చేశారు. అనంతరం ట్రంప్‌ నేరుగా రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. అక్కడున్న సందర్శకుల బుక్‌లో ట్రంప్‌ దంపతులు సంతకం చేశారు. ట్రంప్‌తో కలిసి మెలానియా.. రాజ్‌ఘాట్‌లో మొక్క నాటారు.


 


 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు