నా జన్మదిన వేడుకల్ని జరుపవద్దు: మోడీ

14 Sep, 2014 21:52 IST|Sakshi
నా జన్మదిన వేడుకల్ని జరుపవద్దు: మోడీ
న్యూఢిల్లీ: జమ్మూ,కాశ్మీర్ ను వరదలు ముంచెత్తుతున్న సమయంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం సమంజసం కాదని భారత ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 17 తేదిన తన జన్మదినాన్ని ఎవరూ జరుపుకోవద్దని ప్రధాని సూచించారు. జన్మదినవేడుకలకు బదులుగా జమ్మూ,కాశ్మీర్ ప్రజలకు సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 
 
తన జన్మదినం రోజున చైనా అధ్యక్షుడు జి జింప్పింగ్ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. మనమంతా కలిసి జిప్పింగ్ కు ఘన స్వాగతం పలుకుదామని ఆయన అన్నారు. ఈనెల 17 తేదిన మోడీ 64వ జన్మదినాన్ని జరుపుకోనున్నారు. 
Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు