లక్ష్మణ రేఖను దాటొద్దు...

16 Dec, 2014 12:40 IST|Sakshi
లక్ష్మణ రేఖను దాటొద్దు...

న్యూఢిల్లీ : ప్రతిపక్షాలతో సహా ఎవ్వరూ వేలెత్తి చూపేలా వ్యాఖ్యలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం బిజెపి ఎంపీలకు సలహా ఇచ్చారు. ఎంపీలు  లక్ష్మణరేఖను దాటవద్దని ఆయన సూచించినట్లు సమాచారం. బిజెపి ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివాదాలకు దూరంగా ఉండాలన్నారు.

అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యత్నించాలని మోదీ చెప్పారు. అభివృద్ధికి సంబంధించి కలవాలనుకునేవారికి తాను ఎప్పుడూ అందుబాబులో ఉంటానని చెప్పారు. వివాదాస్పద వ్యాఖ్యలతో బిజెపి ఎంపీలు కలకలం రేపిన తరుణంలో ప్రధాని వ్యాఖ్యలకు ప్రాధాన్యత పెరిగింది.

 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు