పాక్‌లో చదివించొద్దు..

26 Jul, 2016 01:33 IST|Sakshi

- ఇస్లామాబాద్‌లోని దౌత్యాధికారులకు ఆదేశం
- పాక్ ‘నాన్ స్కూల్ గోయింగ్ స్టేషన్’గా ప్రకటించిన భారత్
 
 న్యూఢిల్లీ : హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ అనంతరం.. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ‘అతి’ చేస్తుండటం, ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషన్ వద్ద జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్‌ను ‘నాన్ స్కూల్ గోయింగ్ స్టేషన్’గా సోమవారం ప్రకటించింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ అధికారులు తమ పిల్లలను పాక్‌లోని పాఠశాలలకు పంపొద్దని ఆదేశించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పాక్ వెలుపల చదివించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలంది.

తమ దౌత్య కార్యాలయాల్లోని సిబ్బంది, వారికి సంబంధించిన విధానాలపైనా, అక్కడి ప్రస్తుత పరిస్థితులపైనా సమీక్షించిన తర్వాత ఈ మేరకు ప్రకటన జారీ చేసింది.  ఇస్లామాబాద్‌లోని హై కమిషన్‌లో పనిచేస్తున్న అధికారుల పిల్లలు 50 మంది వరకు స్కూళ్లకు వెళ్లే వారు ఉన్నారు.  భారత నిర్ణయంపై పాక్ మండిపడింది.  ‘రెండు నెలల కిందట ఈ అంశం గురించి మాకు చెప్పింది. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి సమచారం ఇవ్వలేదు’ అని ఆరోపించింది.

>
మరిన్ని వార్తలు