ఒంటరిగా ఉండలేకపోతున్నాను

9 Oct, 2015 14:04 IST|Sakshi
ఒంటరిగా ఉండలేకపోతున్నాను

ముంబై:  షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా  జైలుగదిలో ఒంటరిగా ఉండలేకపోతోందిట. సెల్ లో ఒంటరిగా  ఉండడం వల్ల తనకు  డిప్రెషన్ మరింత పెరుగుతుందని ఆమె ఆందోళన చెందుతోంది. అందుకే తనను ఐసోలేటెడ్ సెల్లో ఉంచొద్దంటూ  జైలు అధికారులకు ఇంద్రాణి మొరపెట్టుకుంది. 

జైళ్ల శాఖ  ముఖ్య కార్యదర్శి  డా. విజయ్ సత్బీర్ సింగ్ జైల్లో ఆమెను  కలిసినపుడు ఒంటరిగా ఉండలేకపోతున్నానని, తనను  ఏకాకిగా ఉంచొద్దంటూ విజ్జప్తి చేసింది. అసలే డిప్రెషన్తో  బాధపడుతున్న తనకు, విడిగా సెల్లో ఒంటరిగా ఉండడం కష్టంగా ఉందని తెలిపింది.  ఇది తన మానసిక స్థితిని మరింత  దెబ్బ తీస్తుందని, తను ప్రత్యేక సెల్లో ఉంచొద్దని ఇంద్రాణి కోరింది. ఆమె విజ్ఞప్తికి  జైలు అధికారులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.  ఆమె అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఆమెను వేరే సెల్ కు తరలించనున్నట్లు తెలుస్తోంది.

కన్న కూతురు షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉండి విచారణ నిమిత్తం జైలు అధికారుల కస్టడీలో ఉన్న ఇంద్రాణి మోతాదుకు మించిన మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను జేజే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందచేశారు. కోలుకున్న అనంతరం ఆమెను తిరిగి జైలుకు తరలించారు.

మరిన్ని వార్తలు