ట్రిపుల్ తలాక్ తో ముడిపెట్టొద్దు..

14 Oct, 2016 14:57 IST|Sakshi
ట్రిపుల్ తలాక్ తో ముడిపెట్టొద్దు..

న్యూఢిల్లీః ఏకరూప పౌర నియమావళి (యూనిఫాం సివిల్ కోడ్) ను,  ట్రిపుల్ తలాక్ విధానం నిలిపివేయడాన్ని ముడి పెట్టవద్దని, ముఖ్యంగా ఇటువంటి విషయాలను రాజకీయం చేయవద్దని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. యూనిఫాం సివిల్ కోడ్, ట్రిపుల్ తలాక్ విషయాల్లో ప్రజలు అయోమయంలో ఉన్నారన్నారు. సమస్యను చర్చించడంలో ఎటువంటి తప్పు లేదని, ప్రజలపై బలవంతంగా రుద్దే అవకాశమే లేదని ఆయన చెప్పారు.

యూనిఫాం సివిల్ కోడ్ కు వ్యతిరేకంగా  ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మీడియా సమావేశం నిర్వహించిన సందర్భంగా వెంకయ్య నాయుడు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. యూనిఫాం చట్టాలు ఏకాభిప్రాయం అధారంగా ఉంటాయని, అటువంటి వాటిని తప్పనిసరిగా చర్చించాల్సి అవసరం ఉందని చెప్పారు. అసలు సమస్య మహిళలకు సమాన హక్కులు ఇవ్వడంపైనేనని, ఈ విషయంలో ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోబోమని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు