వ్యాయామం చేసేట‌పుడు మాస్కు పెట్టుకోవాలా?

16 Jul, 2020 18:09 IST|Sakshi

న్యూఢిల్లీ: గాలి ద్వారా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతుంద‌ని కొంద‌రు శాస్త్రవేత్త‌లు బ‌ల్ల‌గుద్ది చెప్తున్నారు. మొద‌ట దీన్ని అంగీక‌రించ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ(డ‌బ్ల్యూహెచ్‌వో) గాలి ద్వారా వైర‌స్ సంక్ర‌మ‌ణ జ‌రుగుతుంద‌ని  శాస్త్రవేత్త‌లు సాక్ష్యాధారాల‌తో స‌హా లేఖ రాయ‌డంతో ఆ త‌ర్వాత ఒప్పుకోక త‌ప్ప‌లేదు. కాబ‌ట్టి ముందుజాగ్ర‌త్తగా ఇంట్లో ఉన్న‌ప్పుడు కూడా మాస్కులు ధ‌రించాల్సిందేనంటున్నారు నిపుణులు. అయితే వ్యాయామం చేసే స‌మ‌యంలో మాస్కు పెట్టుకోవాలా? వ‌ద్దా? అన్న సందేహం చాలామందికి వ‌చ్చే ఉంటుంది. కానీ వ్యాయామం చేసిన‌ప్పుడు మాస్కు పెట్టుకుంటే ఊపిరి ఆడ‌టం క‌ష్టమ‌వుతుంది. (మాస్క్‌ చాలెంజ్‌!)

కాబ‌ట్టి ఎక్స‌ర్‌సైజ్ చేసేట‌పుడు మాస్కు పెట్టుకోకూడ‌ద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ స్ప‌ష్టం చేశారు. ఆ స‌మ‌యంలో మాస్కు ధ‌రిస్తే వ‌చ్చే ప్ర‌తికూల‌త‌ల‌ను కూడా వివ‌రించారు. 'వ్యాయామం వ‌ల్ల వ‌చ్చే చెమ‌ట‌తో మాస్కు నానిపోతుంది. అది వైర‌స్ వంటి సూక్ష్మ‌జీవుల పెరుగుద‌ల‌ను ప్రోత్స‌హిస్తుంది. కాబ‌ట్టి వ్యాయామం చేసేట‌ప్పుడు ఒక మీట‌ర్ క‌న్నా ఎక్కువ‌గా భౌతిక దూరం పాటిస్తే స‌రిపోతుంద'‌ని సూచించారు. (కరోనా: ఆ ద‌శ‌కు భార‌త్ ఇంకా చేరుకోలేదు)

మరిన్ని వార్తలు