సైనికుల ఫొటోలు వాడొద్దు

10 Mar, 2019 04:14 IST|Sakshi

పార్టీలకు ఎన్నికల కమిషన్‌ ఆదేశం

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార సమయంలో సైనికుల ఫొటోలను ప్రదర్శించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్, బీజేపీ నాయకులతో కూడిన హోర్డింగ్‌ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ హోర్డింగ్‌ ఎక్కడ ఏర్పాటుచేశారో తెలియరాలేదు. ప్రచార చిత్రాలు, హోర్డింగ్‌లలో సైనిక సిబ్బంది ఫొటోలు లేకుండా చూడాలని 2013లోనూ ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది. సైనికుల ఫొటోలను రాజకీయ నాయకులు, పోటీచేస్తున్న అభ్యర్థులు వాడుకుంటున్నారని, ఈ పోకడను నియంత్రించేందుకు తగిన ఆదేశాలు జారీచేయాలని అప్పట్లో రక్షణ మంత్రిత్వ శాఖ ఈసీని కోరింది.   

మరిన్ని వార్తలు