చీరకట్టుతో అలరించిన దురదర్శన్‌ వ్యాఖ్యాత..!

17 Sep, 2019 15:07 IST|Sakshi

దూరదర్శన్‌ చానల్‌లో ప్రత్యేకమైన శైలితో శ్రోతలకు వార్తలు వినిపించిన అలనాటి న్యూస్‌రీడర్‌ సల్మా సుల్తాన్ ఓ ఫ్యాషన్‌ షో లో ర్యాంప్‌పై మెరిశారు. 72 ఏళ్ల వయసులోనూ ఆమె తన చీరకట్టుతో షోలో పాల్గొని అందర్ని అలరించారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ ఫ్యాషన్‌ షోలో సుల్తాన్‌ భారతీయ సంస్కృతిని, చీరలకు ఉన్న సాంప్రదాయ విలువలను ప్రతిబింబిచే విధంగా చీరుకట్టుతో ర్యాంప్‌పై నడిచారు. చీరకట్టు గొప్పతనాన్ని మహిళలకు తెలియజేయానే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. సల్మా సుల్తాన్ తాను చీరలు ధరించడానికి ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం ఉండదని అన్నారు.

ఈ సందర్భంగా సల్మా సుల్తాన్‌ మాట్లాడుతూ.. ‘ఈ ఫ్యాషన్‌ షో చాలా ఆనందం కలిగించింది. చీరకట్టుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ‘చీరలు ధరించడానికి ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం ఉండదని నమ్ముతాను. చీరలు ధరించడానికి మహిళలకు ధైర్యం, విశ్వాసం ఉండాలి. చీరలపైన అమితమైన విశ్వాసం, ఇష్టం ఉంటే.. ఏ వేషాధారణలో ఉన్నా మహిళలకు ఎటువంటి సమస్యలు తలెత్తవు’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ షోవన నారాయణ్‌తో పాటు ‘ఫ్యాషన్ లైఫ్ స్టైల్’ మేగజైన్‌ ప్రముఖులు హాజరయ్యారు.
 
కాగా సుల్తాన్‌ మూడు దశాబ్దాల పాటు దురదర్శన్‌లో వ్యాఖ్యాతగా పనిచేశారు. జర్నలిస్టు, వ్యాఖ్యాతగా సుపరిచితమైన ఆమె 1997 వరకూ పని చేశారు. డీడీలో పని చేసినప్పుడు ఆమె ప్రత్యేకమైన శైలిలో వార్తలను చదివి అందరిని ఆకర్షించేవారు. ఎడమ చెవి కింద జుట్టులో గులాబీతో సాంప్రదాయమైన చీరకట్టుతో వార్తలు చదువుతూ అందరిని ఆకట్టుకునే వారు. ఆమె తన చీరను మెడ, భుజాల చుట్టూ ఆధునిక పద్ధతిలో కప్పుకొని సాంప్రదాయకంగా కనిపించేవారు. వ్యక్తిగత శైలిని ప్రదర్శించిన మొదటి వార్తా వ్యాఖ్యాతల్లో సుల్తాన్‌ ఒకరు. సల్మా  చీరకట్టు, ప్రత్యేకమైన శైలిని చాలా కాలం కొత్త న్యూస్‌రీడర్లు అనుకరించారు.

మరిన్ని వార్తలు