భీకర బైక్ రేస్.. నలుగురు దుర్మరణం

30 Oct, 2015 17:31 IST|Sakshi
భీకర బైక్ రేస్.. నలుగురు దుర్మరణం

బెంగళూరు: ఓ అనాలోచిత చర్య నాలుగు నిండు ప్రాణాలను బలిగొంది. బైక్ రేసింగ్ సరదా నూరేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగిసేలా చేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదూ ఏకంగా నలుగురు విద్యార్థులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. బెంగళూరు విమానాశ్రయం మార్గంలో భీకర బైక్ రేస్ కారణంగా జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం చెందారు.

గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చే దానిని చూసిన వారికి గుండె దడపుట్టించేలా ఉంది. ఆ నలుగురు యువకుల చేతిలో ఉంది లక్షలు పోసి కొన్న స్పోర్ట్స్ బైక్సే కావడం.. అవి గాలికంటే వేగంగా దూసుకెళ్లి అంతే వేగంతో ప్రధాన రహదారిపై పడి వారిని కొన్ని మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో ఓ స్థాయిలో నిప్పులు చెలరేగాయి. ఈ క్రమంలో వారి నలుగురి ప్రాణాలు అక్కడికక్కడే గాల్లో కలిసిపోయాయి.  

అసలు రేస్ ఎలా మొదలైందంటే...

బెంగళూరుకు చెందిన నలుగురు యువకులు...
టైం : అర్థరాత్రి....
ప్లేస్‌ : బెంగళూరు ఏయిర్‌పోర్ట్‌కు వెళ్లే దారి....
బైక్‌ రేస్‌ మొదలయ్యింది....
రయ్ మంటూ దూసుకెళ్లారు....
ఒకరిని మించి మరొకరు.... టార్గెట్‌ను రీచ్‌ కావటానికి పోటీపడ్డారు..
కానీ... టార్గెట్‌కు చేరుకునేలోపే లైన్‌ మిస్‌ అయ్యాడు ఓ రేసర్‌...
రేసర్స్‌ ముందు వీడియో రికార్డ్‌ చేస్తున్న కారును ఢీ కొట్టాడు..
తగిలిన క్షణమే అల్లంత దూరంలో పడిపోయాడు ఆ రేసర్‌..
అతడి వెనుక ఉన్న మరో రేసర్.. తరువాత మరొకరు.. ఇలా అంతా హైస్పీడ్‌లో కిందపడిపోయారు.
తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు..

ఈ రేస్లో వారు చేసిన తప్పులు
మొదటి తప్పు రేసింగ్‌కు సిద్దమైన వారెవరూ హెల్మెట్‌ ధరించలేదు
రెండోది.. ఎలాంటి శిక్షణ తీసుకోకుండా హైస్పీడ్‌ బైక్స్‌పై రేసింగ్‌ కు దిగడం
మూడోది.. అర్థరాత్రి బైక్‌ రేసింగ్‌కు దిగటం
నాలుగోది.. అత్యంత రద్దీగా ఉండే ఏయిర్‌పోర్ట్‌ వెళ్లేదారిని ఎంచుకోవటం
ఐదో తప్పు రేసింగ్‌ సమయంలో ఎలాంటి ఫస్ట్‌ ఎయిడ్‌ చర్యలు అందుబాటులో లేకపోవటం

మరిన్ని వార్తలు