బ్రహ్మోస్‌ డేటా చేరవేత : డీఆర్‌డీఓ ఉద్యోగి అరెస్ట్‌

8 Oct, 2018 16:43 IST|Sakshi

ముంబై : బ్రహ్మోస్‌ క్షిపణికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేశాడనే అనుమానంతో డీఆర్‌డీఓలో పనిచేసే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఆర్‌డీఓ ఉద్యోగి నుంచి అనుమానాస్పద మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు అతడిని ప్రశ్నిస్తున్నారు. స్ధానిక పోలీసుల సహకారంతో యూపీ ఏటీఎస్‌, మిలిటరీ ఇంటెలిజెన్స్‌ సంయుక్త ఆపరేషన్‌లో నాగ్‌పూర్‌లో అదుపులోకి తీసకున్న వ్యక్తిని నిషాంత్‌ అగర్వాల్‌గా గుర్తించారు.

నిషాంత్‌ అగర్వాల్‌ గత నాలుగేళ్లుగా నాగపూర్‌కు సమీపంలోని బ్రహ్మోస్‌ ఉత్పత్తి కేంద్రంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. పాక్‌ సంస్ధలతో బ్రహ్మోస్‌ క్షిపణి గురించిన నిర్ధిష్ట సమాచారం, సాంకేతిక డేటాను అగర్వాల్‌ పంచుకున్నట్టు అనుమానిస్తున్నారు. బ్రహ్మోస్‌ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్‌ మిసైల్‌గా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు