దుర్గా మాతపై దారుణమైన కామెంట్‌

24 Sep, 2017 12:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల ఆరాధ్య దైవం పై దిగ్భ్రాంతికరమైన వ్యాఖ్యలు చేసి ఓ ప్రొఫెసర్‌ చిక్కుల్లో పడ్డారు. దుర్గాదేవిని వేశ్యతో పోలుస్తూ కామెంట్‌ చేయటంతో పలువురు మండిపడ్డారు. ఈ మేరకు ఆయనపై పోలీస్‌ కేసు కూడా నమోదు అయ్యింది. 

ఢిల్లీ యూనివర్సిటీ(డీయూ) పరిధిలోని దయాల్‌ సింగ్‌ కాలేజీలో కేదార్‌ కుమార్‌ మండల్‌ అసిస్టెంట్‌ ప్రోఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నాతో. ఈ నెల 22వ తేదీన తన ట్విట్టర్‌ పేజీలో ‘పురాణాల ప్రకారం దుర్గాదేవి ఓ వేశ్య’ అంటూ ఓ వ్యాఖ్యను పోస్ట్‌ చేశారు. అది చూసిన వారంతా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తమ మనోభావాలను కేదార్‌  దెబ్బతీశాడంట ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ విద్యాసంస్థలు ఆయనపై లోధీ కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. 

తక్షణమే ఆయన్ను విధుల్లోంచి తొలగించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. నవరాత్రుల సమయంలోనే కేదార్‌ మండల్‌ ఇలాంటి కామెంట్లు చేయటంతో ఆ ప్రాంతంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా