వైరల్‌ వీడియో: స్వచ్ఛమైన స్నేహానికి నిదర్శనం

16 Jan, 2020 09:29 IST|Sakshi

స్నేహం.. ఈ పదానికి అర్థం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ విషయాన్ని అయినా ముందుగా స్నేహితుని దగ్గరే చెప్పేస్తాం. మన సంతోషాలతో పాటు బాధలను కూడా పంచుకునే వాడే నిజమైన స్నేహితుడు. కుటుంబం తర్వాత ఎక్కువ అటాచ్‌మెంట్‌ ఉండేది ఆ స్నేహితుల దగ్గరే. మరి ఆ స్నేహితులు దొరకాలంటే అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం ఇక్కడ చేపలకు దొరికింది. అవును చేపలకు ఓ మంచి స్నేహితుడు దొరికాడు. అతని పేరు బాతు. నమ్మడానికి కాస్తా విడ్డూరంగా ఉన్నా ఇది వాస్తవమే..

ఓ సరస్సుకు ఆనుకుని బాతులు ఉన్నాయి. అందులో ఓ బాతుకు చేపతో స్నేహం కుదిరింది. అక్కడ బాతు తింటున్న గింజలను నోటితో చేపలకు అందించింది. దీంతో అక్కడికి చేరుకునే చేపల సంఖ్య పెరిగింది. అయినా వచ్చిన వాటన్నింటికీ ఆహారాన్ని అందిస్తూనే ఉంది. ఈ దృశ్యాన్ని బెంగుళూరుకు చెందిన అటవీశాఖ అధికారి  వీడియో తీసి తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లంతా మంత్రముగ్దులు అవుతున్నారు. ‘‘స్వచ్ఛమైన స్నేహానికి ఇది నిదర్శనం. కేవలం జంతువులు మాత్రమే ఏలాంటి కల్మషం లేని మనస్సును కలిగి ఉంటాయి. మనం నేర్చుకోవాలనుకుంటే ప్రకృతి మనకు చాలా నేర్పిస్తుంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.’’

మరిన్ని వార్తలు