భారీ వర్షాలతో మునిగిన ముంబై

4 Sep, 2019 12:25 IST|Sakshi

ముంబై: భారీ వర్షాలతో అస్తవ్యస్తమైన ముంబైలో భారత వాతవరణ శాఖ హెచ్చరికలతో స్కూళ్లు, కాలేజీలకు బుధవారం సెలవు ప్రకటించారు. ముంబై నగరంలో రానున్న రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసి, ఆరెంజ్‌ అలర్ట్‌ను ప్రకటించింది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా  నగరంలో జనజీవనం స్తంభించింది. రోడ్లపై పలు ప్రాంతాల్లో నీరు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో ట్రైన్‌లు, విమానాల రాకపోకలు స్థంభించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు వరదలతో ఇబ్బంది పడకుండా పలు ప్రభుత్వ విభాగాలు ట్విటర్‌లో  చురుకుగా ఉంటున్నాయి. ముంబైను సురక్షితంగా ఉంచేందుకు ఏదైనా సహాయం కావాలంటే 1916కు కాల్‌ చేయాలని అధికారులు సూచనలు జారీ చేశారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా