సంజయ్‌దత్‌కు ‘ఫర్లాఫ్’పై దర్యాప్తు

27 Dec, 2014 04:44 IST|Sakshi
సంజయ్‌దత్‌కు ‘ఫర్లాఫ్’పై దర్యాప్తు

ముంబై: ప్రముఖ హీరో, 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషి సంజయ్‌దత్‌కు పదేపదే ఫర్లాఫ్ (తాత్కాలిక సెలవులాంటిది) మంజూరు చేయడంపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. జైలు అధికారులు సంజయ్‌దత్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారన్న సమాచారం మేరకు ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా జైళ్లశాఖ డీఐజీని ఆదేశించింది. ‘‘ఫర్లాఫ్ కోసం నలుగురైదుగురు దరఖాస్తు చేయగా అందులో సంజయ్‌దత్‌కు మాత్రమే పదే పదే ఇస్తున్నారు. ఏ చట్టం ప్రకారం ఇది జరుగుతుందో, చట్టంలో ఈ వెసులుబాటు ఉంటే మిగతావారికి ఎందుకు వర్తించడంలేదో తెలుసుకోవాల్సి ఉంది’’ అని రాష్ర్ట హోం శాఖ మంత్రి రామ్ షిండే చెప్పారు. సంజయ్‌దత్ బుధవారం ఎరవాడ జైలునుంచి 14 రోజుల ఫర్లాఫ్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.  
 

మరిన్ని వార్తలు