మరో 8 నగరాల్లో ఈ–వీసాలు

29 Oct, 2018 02:28 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచంలోని మరో 8 నగరాల నుంచి పర్యాటకులు ఇకపై సులభంగా భారత్‌ను సందర్శించేందుకు విదేశాంగశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆయా నగరాలకు చెందిన పర్యాటకులకు బయో మెట్రిక్‌ విధానంలో ఈ–వీసా మంజూరు చేయనున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ 8 నగరాల్లో ఒట్టావా (కెనడా), సెయింట్‌ పీటర్స్‌బర్గ్, వ్లాడివోస్తక్‌ (రష్యా), మ్యూనిచ్‌ (జర్మనీ), బ్రస్సెల్స్‌ (బెల్జియం), ఓస్లో (నార్వే), బుడాపెస్ట్‌ (హంగేరి), జగ్రీబ్‌ (క్రొయేషియా) ఉన్నాయి. ఆయా నగరాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయాల్లో బయో మెట్రిక్‌ వివరాలు ఇస్తే చాలు ఈ–వీసా ఇస్తారు. భారత్‌కు వచ్చాక మళ్లీ ఈ–వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.

మరిన్ని వార్తలు