ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపం..

13 Sep, 2018 05:56 IST|Sakshi

కోల్‌కతా: అస్సాం, మేఘాలయ, బిహార్, జార్ఖండ్‌ సహా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం భూకంపం సంభవించింది. ఉదయం 10.20 సమయంలో పలు ప్రాంతాల్లో 15 నుంచి 20 సెకన్ల పాటు భూమి కంపించినట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.5గా నమోదైంది. అస్సాంలోని కోక్రాఘర్‌ పట్టణానికి వాయవ్య దిశలో రెండు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూఉపరితలానికి 10 కి.మీ లోతులో భూమి కంపించింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు. 

మరిన్ని వార్తలు