ఎబోలా నిరోధానికి కసరత్తు

17 Oct, 2014 01:46 IST|Sakshi
ఎబోలా నిరోధానికి కసరత్తు

19, 20 తేదీల్లో రాష్ట్రాల అధికారులకు ఢిల్లీలో శిక్షణ
 
న్యూఢిల్లీ/ముంబై: ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకించి, పశ్చివూఫ్రికా దేశాల్లో దాదాపు 4వేలమందికిపైగా వుృతికి కారణమైన భయనక ఎబోలా వ్యాధి నిర్ధారణ, నిరోధంపై అన్ని రాష్ట్రాల ఆరోగ్య అధికారులకు శిక్షణ ఇవ్వాలని కేంద్రప్రభుత్వం సంకల్పించింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్ సేథ్, కేంద్ర హోంశాఖ కార్యద ర్శి అనిల్ గోస్వామి నిర్వహించిన ఉన్నతస్థారుు సవూవేశంలో ఈ మేరకు నిర్ణయుం తీసుకున్నారు.  ఈ నిర్ణయుంమేరకు ఎబోలా నిరోధంపై వివిధ రాష్ట్రప్రభుత్వాల అధికారులు ఈ నెల 19,20 తేదీల్లో ఢిల్లీలో శిక్షణపొందుతారని, వారు తవుతవు రాష్ట్రాలకు తిరిగివచ్చి, అధికారులకు శిక్షణ ఇస్తారని అధికారవర్గాలు తెలిపారుు. దేశంలోకి ప్రవేశించే ప్రతి ప్రయూణికుడి కీ ఎబోలా పరీక్షలు నిర్వహించేందుకు తవు తవు రాష్ట్రాల్లోని వివూనాశ్రయూల్లో, ఓడరేవుల్లో తగిన ఏర్పాట్లు చేయూలని, ఎబోలా వైరస్ సోకిన వారెవరూ దేశంలోకి రాకుండా చూడాలని రాష్ట్రప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను కేంద్ర కేబినెట్ కార్యదర్శి ఆదేశించారు.

ఎబోలా ప్రపంచమంతటా వ్యాపించే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని, నిరోధంపై పూర్తిశ్రద్ధతో వ్యవహరించాలని కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు సూచిం చింది. జ్వరం, ఒళ్లునొప్పులు, వాంతులు, విరేచనాలు వంటి ఎబోలా వ్యాధిలక్షణాలున్నవారితో అతి దగ్గరి శారీరక సంబంధాలవల్లనే ఎబోలా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 8వేల మందికి పైగా ఎబోలా వ్యాధి సోకగా, వారిలో 4వేల మంది మరణించారు.

 కాగా, ఆఫ్రికా దేశాలనుంచి దేశంలో ప్రవేశించే ప్రయణికులందరిపైనా, ఎబోలా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు అంతర్జాతీయు విమానాశ్రయూలన్నింటిలోనూ, అంతర్జాతీయు విమానాలు దిగే పుణె, నాగపూర్ విమానాశ్రయూల్లోను థర్మల్ ఇమేజి స్కానర్లను ఏర్పాటు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం బొంబాయి హైకోర్టుకు తెలియజేసింది. కేంద్రం తరఫు న్యాయవాది రూయ్ రోడ్రిజెస్ ఈ విషయన్ని బొంబాయి హైకోర్టు ధర్మాసనానికి నివేదించారు. ఇదిలా ఉండగా, ఎబోలా సంక్షోభం ఇలాగే కొనసాగిన పక్షంలో అది తీవ్రమైన ఆహార సంక్షోభానికి దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు