రోహిణి సింధూరికి ఈసీ క్లీన్‌చిట్‌

16 Apr, 2018 11:27 IST|Sakshi
హాసన్‌ జిల్లా కలెక్టర్‌ రోహిణి సింధూరి

సాక్షి, బెంగళూరు : హాసన్‌ జిల్లా కలెక్టర్‌ రోహిణి సింధూరికి రాష్ట్ర ఎన్నికల అధికారులు క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. హాసన్‌కు చెందిన మంత్రి ఏ.మంజు, రోహిణిపై పలు ఆరోపణలు సంధించి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ఎన్నికల అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ మేరకు మైసూరు ప్రాంతీయ కమిషనర్‌ విచారణ చేసి రాష్ట్ర ఎన్నికల అధికారులకు నివేదిక అందించారు. నివేదిక అనంతరం రోహిణి సింధూరికి క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సంజీవ్‌ కుమార్‌ తెలిపారు.

కాగా హాసన్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి మంజు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తరువాత బంజరు భూములకు సాగు పత్రాలను అందించారని ఆరోపణలు రాగా, సంబంధిత తహశీల్దార్‌ను సస్పెండ్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్‌ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో హాసన్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఏ.మంజు....ఎన్నికల అధికారుల ఆత్మస్దైర్యం దెబ్బతినేలా మంత్రి వ్యవహరిస్తున్నారని కలెక్టర్‌ రోహిణి ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి మంజు ఆమెపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తాను కోడ్‌ ఉల్లంఘించలేదని, తనపై అక్రమంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని, ఆ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని మంత్రి తన లేఖలో కోరారు. అందుకు సమాధానంగా కలెక్టర్‌ ప్రాదేశిక కమిషనర్‌కు రాసిన లేఖలో ఈ ఆరోపణలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన ఈసీ సింధూరికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.

మరిన్ని వార్తలు